నితిన్, రష్మిక రొమాన్స్ డిసెంబర్ నుంచి!
యంగ్ నితిన్ చివరగా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో నితిన్ జోరు తగ్గినట్లు అయింది. దీనితో తదుపరి చిత్రం విషయంలో నితిన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. చలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర విషయంలో చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నితిన్ సరసన ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించనుంది. గీత గోవిందం, ఛలో చిత్రాలతో రష్మిక తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











