న్యూ ఇయర్ స్పెషల్.. రంగ్ దే రాబోయేది ఎప్పుడంటే?
న్యూ ఇయర్ స్పెషల్ అంటూ టాలీవుడ్‌లో కొత్త సినిమా అప్డేట్లు వైరల్ అవుతున్నాయి. సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో సోషల్ మీడియా మొత్తం సందడిగా మారింది. తాజాగా నితిన్ రంగ్ దే యూనిట్ కూడా ఓ అప్డేట్ ఇచ్చింది. రంగ్ దే సినిమా విడుదల తేదీని కాసేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. మామూలుగా ఎప్పుడో రావాల్సిన సినిమా కరోనా వల్ల ఇలా ఆలస్యమైంది.
మామూలుగా అయితే 2020లో నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరిద్దామని ప్రయత్నించిన నితిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అందుకే 2020లో భీష్మ చిత్రమే విడులైంది. మిగిలిన చిత్రాల షూటింగ్‌లు మధ్యలో ఆగిపోయాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ రంగ్ దే, చెక్, అంధాదున్ వంటి మూవీ షూటింగ్‌లను ప్రారంభించాడు. అందులో రంగ్ దే మూవీ శర వేగంగా షూటింగ్ చేసుకుంది.

తాజాగా రంగ్ దే నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. మార్చి 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో వస్తోన్నఈ చిత్రాన్ని ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











