అవి రెండూ ఒకేసారి.. నితిన్ స్పీడ్ మామూలుగా లేదు!
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రంగ్ దే సినిమా కోసం దుబాయ్‌కి చెక్కేశాడు ఈ హీరో. పనిలో పనిగా హనీమూన్ కూడా అయినట్టుందని తన భార్య శాలినీని తీసుకెళ్లాడు. అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకుని మిగిలిన సమయంలో భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు నితిన్. ఇక సెట్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఎంత రచ్చ చేస్తున్నాడో మనమంతా చూస్తున్నాడు.
అయితే నితిన్ దుబాయ్‌లోనే మరో సినిమా షూటింగ్‌ను కూడా మొదలెట్టాడు. అంధాదున్ రీమేక్ షూటింగ్‌ను దుబాయ్‌లో మొదలెట్టినట్టు తాజాగా ప్రకటించాడు. అంధాదున్ మూవీపై రెండు నెలల క్రితం అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. హిందీలో హిట్ అయిన ఈ సినిమాలో దక్షిణాది అభిరుచులకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్టు చెప్పారు.

టబు పాత్రలో తమన్నా, రాధిక ఆప్టే పాత్రలో నభా నటేష్ నటించనున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం నితిన్ ఒక్కడే షూటింగ్‌లో పాల్గొన్నాడు. జనవరిలో మొదలుపెట్టే షెడ్యూల్‌లో నభా నటేష్, తమన్నా కూడా జాయిన్ కానున్నారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది నితిన్ వరుసగా సినిమాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. రంగ్ దే, చెక్, అంధాదున్ రీమేక్‌లతో వరుసగా హిట్టు కొట్టేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











