ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త... ఈ ఏడాది సెలబ్రేషన్స్ లేనట్లేనా?
ప్రతి ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా జరుగుతుంది. తారక్ తన కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన స్నేహితులతో బర్త్ డే పార్టీ జరుపుకుంటారు. అభిమానులను మీట్ అవుతారు. అయితే ఈ ఏడాది మే 20న అలాంటి సెలబ్రేషన్స్ ఏమీ ఉండక పోవచ్చని అంటున్నారు.
ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడులకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. కారణం... ఇంకా తన తండ్రి హరికృష్ణ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే అని అంటున్నారు. ఆయన మరణించిన సంవత్సరం పూర్తి కానందున తారక్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
గతేడాది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుటుంబంలో ఎలాంటి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అందుకే ఈ సారి పెట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపే ట్యాగ్‌తో ట్విట్టర్లో అభిమానులు ఆల్రెడీ హడావుడి మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ 'RRR' చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఇది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. కొమురం భీం, అల్లూరి సీతా రామరాజు స్పూర్తిగా కల్పిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
బ్రిటిష్ పాలనా కాలం 1920 బ్యాక్ డ్రాపుతో రూపొందుతున్న ఈ పీరియడ్ ఫిల్మ్‌లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించేది ఒక్క హీరోయిన్ కాదని, ఇద్దరు అని తెలుస్తోంది. ఇందులో ఒక పాత్రలో నిత్యా మీనన్ నటించబోతోందట. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











