భారీ షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్.. నిరుత్సాహంగా ఉన్నా ఆ రికార్డులపై కన్నేశారు!

By Manoj

బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయినా.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయ్యాడు. ఇక, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మొదలుకొని ఏకంగా ఐదు వరుస హిట్లను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. దీంతో చాలా మంది నిరుత్సాహానికి లోనైవుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

 ఇండస్ట్రీలో అరుదైన రకం.. జూనియర్ ఎన్టీఆర్

ఇండస్ట్రీలో అరుదైన రకం.. జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అద్భుతమైన నటన, గ్రేస్‌తో కూడిన డ్యాన్స్, ఎలాంటి డైలాగ్‌నైనా అలవోకగా చెప్పే నైపుణ్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలను బాగా పడించడం వంటి వాటి వల్ల అతడు అల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అలాగే, అప్పుడప్పుడూ పాటలు కూడా పాడుతూ అలరిస్తున్నాడు.

పోరాటం చేయడానికి సిద్ధమైన యంగ్ టైగర్

పోరాటం చేయడానికి సిద్ధమైన యంగ్ టైగర్

కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమరం భీంగా నటిస్తుండగా.. చెర్రీ మాత్రం అల్లూరి పాత్రను పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరోసారి జోడీ... ఈ సారి ఆ లోటు ఉండదట

మరోసారి జోడీ... ఈ సారి ఆ లోటు ఉండదట

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR తర్వాత తారక్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘అరవింద'లో లేని ఎలిమెంట్స్ ఈ మూవీలో చూపించబోతున్నారని సమాచారం.

పాన్ ఇండియా స్టార్‌ అయిపోవడం ఖాయమే

పాన్ ఇండియా స్టార్‌ అయిపోవడం ఖాయమే

RRRతో పాటు త్రివిక్రమ్ తెరకెక్కించే మూవీలు పూర్తీ కాకముందే.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, అట్లీ, తరుణ్ భాస్కర్ సహా కొంత మంది బాలీవుడ్ దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ప్రశాంత్ నీల్‌తో మూవీ మాత్రం కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

 ఆరోజే వీటన్నింటిపై క్లారిటీ వచ్చేస్తుందంట

ఆరోజే వీటన్నింటిపై క్లారిటీ వచ్చేస్తుందంట


మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. దానిని పురస్కరించుకుని చాలా సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం... ఆరోజున RRRలో ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన వీడియో, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌తో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాపై ప్రకటన వెలువడతాయని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వాళ్లకు భారీ షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్

వాళ్లకు భారీ షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ పుట్టినరోజు త్వరలో రాబోతుండడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అలాగే, ఇటీవల తారక్ బర్త్‌డే కామన్ డీపీని 25 మంది సినీ ప్రముఖులతో విడుదల చేయించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు యంగ్ టైగర్ భారీ షాక్ ఇవ్వబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Recommended Video

#Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
నిరుత్సాహంగా ఉన్నా ఆ రికార్డులపై కన్ను

నిరుత్సాహంగా ఉన్నా ఆ రికార్డులపై కన్ను

కరోనా ప్రభావం కారణంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని తారక్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లేఖను కూడా అతడు రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం కాస్తా నందమూరి అభిమానుల వరకు వెళ్లడంతో వాళ్లంతా నిరుత్సాహ పడుతున్నారు. కానీ, ఆరోజు రికార్డులు క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X