Mahesh babu తగ్గెదేలే... అవన్నీ పుకార్లే... ఒక్క ప్రకటనతో తేల్చేసిన యూనిట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి రావడం లేదని సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం నిజం కాదని తేల్చేసింది సినిమా యూనిట్. ఈ మేరకు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

బ్యాంకర్ గా
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. అందుకు తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదల అవుతున్న అప్డేట్స్ కూడా సినిమా మీద ఆసక్తి అంతకంతకూ పెంచేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం - మోసాలు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంకింగ్ మోసాన్ని ఛేదించే బ్యాంకర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

వాయిదా వేసుకోవాలని కోరి
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే అక్టోబర్ 13వ తేదీన విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి ఏడో తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన రాకముందే రాజమౌళి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వారిని వారి వారి సినిమాలను వాయిదా వేసుకోవాలని కోరినట్లుగా ప్రచారం జరిగింది.

మహేష్ బాబు సినిమా వాయిదా
ప్రభాస్, పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకోవడానికి ఆసక్తి చూపించకపోయినా సినిమా షూటింగ్ ఇంకాస్త ఆలస్యం అయ్యే సూచనలు ఉండడంతో మహేష్ బాబు సినిమా వాయిదా వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అందుకే ధైర్యంగా రాజమౌళి ఏడో తేదీన తమ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారని గతంలో ప్రచారం జరిగింది. అయితే అక్టోబర్ 17వ తేదీ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సినిమా నిర్మాణ సంస్థ 13వ తేదీన కచ్చితంగా వచ్చితీరుతుందని రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవనే విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది..

రాజమౌళి ప్రకటనతో
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం ఒక రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించగా సర్కార్ సినిమా 13వ తేదీన విడుదల అవుతోంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ సినిమా కాకుండా వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఎఫ్ 3 సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

గట్టిగానే సంక్రాంతి
అలా మొత్తం మీద సంక్రాంతి మాత్రం ఈసారి గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. అయితే గత ఏడాది పెద్ద సినిమాలు లేక మొహం వాచిపోయిన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ ఏడాది సినిమాలను ఆదరిస్తారని టాలీవుడ్ దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











