twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సీఎం విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం: ముగ్గురు స్టార్ హీరోలు ఒప్పుకోకపోవడం వల్లే ఇలా!

    |

    దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలోనే సీనియర్ హీరోల నుంచి పోటీ ఉన్నా.. తట్టుకుని నిలబడగలిగాడాయన. అంతేకాదు, ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన ఈ మెగా హీరో.. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఫుల్ జోష్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విషయంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

    ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

    రీఎంట్రీలో రెండు సినిమాలు.. ఒకటలా.. ఇంకోటిలా

    రీఎంట్రీలో రెండు సినిమాలు.. ఒకటలా.. ఇంకోటిలా

    సుదీర్ఘ విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆయన మరింత వేగం పెంచి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సైరా: నరిసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆశించినంతగా ఆడలేదు.

    రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్.. చివరి అంకానికి

    రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్.. చివరి అంకానికి

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'సైరా: నరసింహారెడ్డి' నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు చిరంజీవి. ఇందుకోసం బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

    మలయాళంలో మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

    మలయాళంలో మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

    'ఆచార్య' పట్టాలపై ఉండగానే 'లూసీఫర్' రీమేక్‌ను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన డైరెక్టర్.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేస్తున్నాడట.

    లూసీఫర్ రీమేక్‌లో రెండు పాత్రల గురించే చర్చలు

    లూసీఫర్ రీమేక్‌లో రెండు పాత్రల గురించే చర్చలు

    లూసీఫర్ రీమేక్‌ను చిరంజీవి చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి అందులో అత్యంత కీలకమైన టోవీనో థామస్ చేసిన యంగ్ సీఎం రోల్, మంజూ వారియర్ చేసిన హీరో సోదరి పాత్ర గురించే చర్చలు జరుగుతున్నాయి. వీటిని పలానా యాక్టర్లు చేయబోతున్నారని ఎప్పటి నుంచో పలు ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు తెరపైకి వస్తున్నాయి.

    ఆ సీఎం విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం

    ఆ సీఎం విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం

    లూసీఫర్ తెలుగు రీమేక్‌లో యంగ్ సీఎం రోల్‌ను విలక్షణ నటుడు సత్యదేవ్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్ కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీఎం విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట.

    ముగ్గురు స్టార్ హీరోలు ఒప్పుకోకపోవడం వల్లే ఇలా

    ముగ్గురు స్టార్ హీరోలు ఒప్పుకోకపోవడం వల్లే ఇలా

    వాస్తవానికి ఈ పాత్ర కోసం రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలతో సంప్రదింపులు జరిపిందట చిత్ర యూనిట్. కానీ, వాళ్లు ముగ్గురూ దీనికి అంగీకరించలేదని అంటున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆదేశాల ప్రకారం.. దర్శకుడు మోహన్ రాజా తెలుగు రీమేక్‌లో ఏకంగా ఈ ముఖ్యమంత్రి పాత్రనే లేపేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

    English summary
    Chiranjeevi is currently shooting for Koratala Siva’s ‘Acharya’ as well. The regular shoot ‘Lucifer’ will start in March. Chiranjeevi and Nayanthara had earlier acted together as husband and wife in ‘Sye Raa Narasimha Reddy’. More.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X