వెరీ ఇంట్రెస్టింగ్: అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. షాక్‌లో స్టైలిష్ స్టార్ అభిమానులు.!

By Manoj Kumar P

వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత అల్లు అర్జున నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ తెగ బాధ పడిపోయారు. దీంతో అతడు స్పీడు పెంచాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం గతంలో వీరిద్దరి కాంబోలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్‌ హిట్ చిత్రాలు రావడమే. 'అల' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బన్నీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? పూర్తి వివరాల్లోకి వెళితే...

వైకుంఠపురములో వాళ్లందరూ ఉన్నారు

వైకుంఠపురములో వాళ్లందరూ ఉన్నారు

త్రివక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అలాగే ఇందులో నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

ఇది రాకముందే మరో ప్రయోగం చేస్తున్నాడు

ఇది రాకముందే మరో ప్రయోగం చేస్తున్నాడు

‘అల.. వైకుంఠపురములో' పట్టాలపై ఉండగానే మరో డైరెక్టర్ సుకుమార్‌తో మూవీ చేస్తున్నట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్

రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్

సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వదులుతున్న ప్రతి పాటకూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ‘సామజవరగమన', ‘రాములో రాములా' అనే పాటలు దక్షిణ భారతదేశ రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, టీజర్ కూడా సత్తా చాటింది.

కీలక ప్రకటన చేసిన చిత్ర యూనిట్

కీలక ప్రకటన చేసిన చిత్ర యూనిట్

సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జనవరి 6న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 అల్లు అర్జున్ సంచలన నిర్ణయం

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం

తాజాగా ఈ వేడుక గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్నో హంగులతో నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరినీ ఆహ్వానించలేదట బన్నీ. కానీ, ఈ ఫంక్షన్ ఆద్యంతం అతడు థమన్ లైవ్ మ్యూజిక్‌కు డ్యాన్స్‌లు చేయబోతున్నాడట. అందుకే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్‌ను ఆహ్వానిస్తున్నారని సమాచారం.

అసలైన వేడుక ఉంటుందా.?

అసలైన వేడుక ఉంటుందా.?

ప్రస్తుతం మ్యూజికల్ కన్సర్ట్ తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా..? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఉంటే దానికైనా గెస్ట్ వస్తారా.? లేదా.? అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ‘అల' మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X