షాకింగ్: చిరంజీవి సెన్సేషనల్ డెసీషన్.. తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న మెగాస్టార్

By Manoj

రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడు ప్రదర్శిస్తున్నారు. సమయం ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేయడంతో పాటు ఖాళీ సమయాల్లో కథలు వింటున్నారు. ఈ క్రమంలోనే పలువురు యంగ్ డైరెక్టర్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేయబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ ఉండదని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరు సినిమాకు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

రెండు సినిమాలే ఆలస్యం.. స్పీడు పెరిగింది

రెండు సినిమాలే ఆలస్యం.. స్పీడు పెరిగింది

చాలా కాలం పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగిన చిరంజీవి... రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత ఆయన ‘సైరా: నరసింహారెడ్డి' మూవీ చేశారు. ఈ సినిమా విడుదలకు చాలా సమయం పట్టింది. కానీ, ఆ తర్వాత నుంచి చిరంజీవి స్పీడు పెంచేసి రెండు, మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు.

అది రిలీజ్ కాకముందే.. ఇది మొదలెట్టారు

అది రిలీజ్ కాకముందే.. ఇది మొదలెట్టారు

‘సైరా' మూవీ రిలీజ్ కాకముందే మెగాస్టార్ చిరంజీవి... బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందుకు అనుగుణంగానే పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించేసి, ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. ‘ఆచార్య' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చిరంజీవికి హ్యాండిస్తున్న స్టార్ హీరోయిన్లు

చిరంజీవికి హ్యాండిస్తున్న స్టార్ హీరోయిన్లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య'లో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. వాస్తవానికి ఇందులో త్రిష నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఆమె సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత అనుష్కను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆమె కూడా సినిమా చేయడానికి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.

ఏకంగా ముగ్గురిని లైన్‌లో పెట్టిన మెగాస్టార్

ఏకంగా ముగ్గురిని లైన్‌లో పెట్టిన మెగాస్టార్

ప్రస్తుతం ‘ఆచార్య' నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లాక్‌డౌన్ వల్ల వచ్చిన గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు డైరెక్టర్లను ఫైనల్ చేశారు. ఇందులో భాగంగా బాబీ, సుజిత్, మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇందులో సుజిత్ తెరకెక్కించే చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్' అని కూడా ఆయన తెలిపారు.

షాకింగ్: చిరంజీవి సినిమాలో నో హీరోయిన్

షాకింగ్: చిరంజీవి సినిమాలో నో హీరోయిన్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘లూసిఫర్'. స్టార్ హీరో పృథ్వీ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మోహన్ లాల్ పాత్రకు హీరోయిన్ ఉండదు. దీంతో ఇప్పుడు చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలోనూ హీరోయిన్ పాత్ర ఉండే అవకాశాలు లేవని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Prabhas Special Request To Ram Charan
తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న మెగాస్టార్

తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న మెగాస్టార్

సుదీర్ఘమైన తన సినీ కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ హీరోయిన్ లేకుండా సినిమా చేయలేదు. హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేసినా... పాటలకో, కొన్ని సీన్లకో పరిమితం అయ్యేలా హీరోయిన్లకు పాత్రలను పెట్టుకున్నారు. అయితే, ‘లూసిఫర్' రీమేక్‌లో విషయంలో మాత్రం ఆయన సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X