తన పెళ్లికి. రానాకు లింకు పెట్టిన వరుణ్ తేజ్!
వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్లుగా రూపొందిన 'ఎఫ్ 2' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో వెంకీ, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా ప్రేక్షకులను అలరించబోతున్నారు. రీల్ లైఫ్‌లో పెళ్లి చేసుకున్నారు... మరి రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు వరుణ్ తేజ్ ఆసక్తికరంగా స్పందించారు.
నా పెళ్లి గురించి అందరికీ ఎందుకు ఇంత తొందరో అర్థం కావడం లేదు. నాకంటే సీనియర్ యాక్టర్లు, పెళ్లి కానివారు చాలా మంది ఉన్నారు. రానాతో పాటు చాలా మంది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. రానా పెళ్లి చేసుకున్న తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.

మా ఇంట్లో కూడా తొందరగా పెళ్లి చేసుకుని సెటిలవ్వమని అడుగుతున్నారు. వారికి నేను ఒకటే చెప్పాను... మరో 3 సంవత్సరాల వరకు పెళ్లి ఆలోచన కూడా చేయను, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్ంయలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


Click it and Unblock the Notifications











