పుష్ప 2 ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అవతార్ 2తో రావాల్సిన సర్‌ప్రైజ్ క్యాన్సిల్!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వాళ్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా డైరెక్ట్ గా గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు కూడా నిరసనలకు దిగారు. పుష్ప మొదటి భాగం భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ను దర్శకుడు అంతకుమించి అనేలా తెరపైకి తీసుకు వస్తున్నాడు.
అయితే మొదటి పార్ట్ వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు కాలేదు. అంతే కాకుండా ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అయితే కొంత సంతృప్తితో ఉన్నారు. అయితే ఇటీవల అవతార్ 2 సినిమాతో పాటు పుష్ప ఫ్యాన్స్ ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు. అవతార్ 2 సినిమా షోలకు అటాచ్ చేస్తూ స్పెషల్ ప్రోమో కూడా విడుదల చేయాలని భావించారు.

అయితే ఇటీవల సినిమాను రష్యన్ భాషలో కూడా భారీగా విడుదల చేయడం వలన చిత్ర యూనిట్ షూటింగ్ క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది. రష్యా వెళ్లి అక్కడే కొన్ని రోజులు ప్రమోషన్స్ కూడా చేశారు. ఇక ఇప్పుడు మరో పని పడటంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. ఫస్ట్ టీజర్ ను ఎలాగైనా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు.
దీంతో గీత ఆర్ట్స్ ముందుగా చేసుకున్న ఉప్పందం ప్రకారం మరొక సినిమా ట్రైలర్ ను అవతార్ 2 సినిమాలకు జత చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప టీజర్ రావాల్సిన ప్లేస్ లో 18 పేజీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఒక విధంగా ఇది బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ అవకాశం నిఖిల్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











