అట్టర్ ఫ్లాప్ సినిమాకు భారీ ఆదరణ... సూపర్ స్టార్ రేంజ్ అదే మరి...
ఆగడు... ఈ పేరు వింటేనే మహేశ్ బాబు ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు. సూపర్ స్టార్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల ఇప్పటివరకూ కోలుకోలేదనే చెప్పాలి. వరుస హిట్స్ తో మాంచి ఊపుమీద ఉన్న వైట్ల ఆగడు అనంతరం ఫ్లాపుల పరంపరను కొనసాగించారు. ప్రస్తుతం వైట్లకు మరో ప్రాజెక్ట్ అప్పజెప్పేందుకూ హీరోలు, నిర్మాతలకూ భయపడే పరిస్థితి నెలకొంది.
అలాంటి ఈ చిత్రం ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. టెలివిజన్ ప్రీమియర్ లోనే మంచి ఆదరణ చూరగొన్న ఆగడు, రిలీజ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా అదే ఊపును కంటిన్యూ చేస్తోంది. హిందీ డబ్బింగ్ వర్షన్ అయితే ఏకంగా సెన్సేషనల్ రికార్డులనే నెలకొల్పుతోంది. వివిధ యూట్యూబ్ ఛానళ్లలో అప్ లోడ్ అయిన ఆగడు సినిమాను మొత్తం మీద 50కోట్ల సార్లు చూసేశారంట జనాలు.

టాలీవుడ్ కు చెందిన ఓ సినిమా ఆ స్థాయిలో వ్యూస్ సంపాదించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. ఓ అట్టర్ ఫ్లాప్ సినిమాను జనాలు ఈ రేంజ్ లో చూసేశారు అంటే, ఆ క్రెడిట్ అంతా సూపర్ స్టార్ మహేశ్ బాబుకే దక్కుతుందని చెప్పాలి. ఏమైనా మన ప్రిన్స్ మామూలోడు కాదని మరో సారి రుజువైంది.


Click it and Unblock the Notifications











