మేమే గర్వంగా ప్రకటిస్తాం.. చిరంజీవి సినిమా గురించి తప్పుడు వార్తలొద్దు!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రం గురించి చాలా రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చిరు నెక్ట్స్ మూవీ కొరటాల దర్శత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైజయంతి సంస్థ స్పందించింది. మెగాస్టార్ తదుపరి చిత్రం వైజయంతి బ్యానర్ లో అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

 No truth in reports circulating in the media regarding VyjayanthiFilms next film with Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, వైజయంతి మూవీస్ కాంబినేషన్లో 4 ఆల్ టైం హిట్ మూవీస్ వచ్చాయి. ఒక వేళ ఐదవ చిత్రం చేస్తే ఆ విషయాన్ని తామే సగర్వంగా ప్రకటిస్తామని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదుల చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X