హీరోయిన్‌తో నటుడు నోయల్ ప్రేమ వివాహం.. రాజమౌళి దంపతులు హాజరు!
టాలీవుడ్ వర్ధమాన హీరో, ర్యాపర్ నోయెల్ సీన్ ఓ ఇంటి వాడయ్యాడు. గత కొద్దికాలంగా నటి ఎస్తేర్ నోరోన్హాతో ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఎస్తేర్, నోయల్ ఒకటయ్యారు. వీరి వివాహం మంగళూరులో జరిగింది. వీరి పెళ్లికి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..

మంగళూరులో నోయెల్ వివాహం
మంగళూరులోని ఓ చర్చిలో నోయెల్, ఎస్తేర్ వివాహం క్రైస్తవ మత పద్థతిలో జరిగింది. వైభవంగా జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి వార్తను అభిమానులతో పంచుకొన్నారు.

మేమిద్దరం ఒకటేనని
తాము ఇప్పుడు ఇద్దరం కాదు. మేమిద్దరం ఒక్కటే. నా హృదయరాణి అని ఎస్తేర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తమ దాంపత్య జీవితానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా చాలా మంది నెటిజెన్లు వీరికి దీవెనలు అందించారు.

రాజమౌళి దంపతులు హాజరు
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు నోయెల్ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ రాజమౌళి కూడా నోయెల్ పెళ్లికి హాజరవ్వడం విశేషం. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలిసింది.

టాలీవుడ్‌లో నోయెల్ కెరీర్
నోయెల్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మగధీర, ఈగ, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్, రంగస్థలం, తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల రిలీజైన హలో గురు ప్రేమ కోసమే, పడి పడి లేచె మనసు చిత్రంలో కూడా ముఖ్య పాత్రలో కనిపించారు.

1000 అబద్దాలతో ఎస్తేర్
మంగళూరుకు చెందిన ఎస్తేర్ నోరోన్హా ‘1000 అబద్ధాలు' సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేకపోయిది. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు', ‘జయ జానకి నాయక' తదితర సినిమాల్లో నటించారు. పలు హిందీ, కన్నడ భాషల్లోనూ నటించారు.


Click it and Unblock the Notifications











