నోటా కథ అల్లు అర్జున్ కోసమే.. ఎందుకు రిజెక్ట్ చేశాడంటే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ ఇంతవరకు తదుపరి చిత్రం ప్రకటించలేదు. ఇదిలా ఉండగా టాలీవుడ్ నయా సంచలనం విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా నోటా రూపొందింది.
ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అల్లు అర్జున్ చాలా రోజులుగా తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం చేయాలని భావిస్తున్నాడు. ఆ ఆయన కోసమే నోటా కథ రూపొందించా. కథ విని చాలా బావుందని బన్నీ తెలిపాడు. కానీ తన బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే చిత్రం కాదని బన్నీ ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

దీనితో కథని విజయ్ దేవరకొండకు వినిపించానని తెలిపాడు. తమిళ సినిమానా అంటూ విజయ్ దేవరకొండ మొదట సందేహం వ్యక్తం చేశాడు. కానీ కథలో వైవిధ్యం ఉండడంతో ఆ తరువాత అంగీకరించాడని ఆనంద్ శంకర్ తెలిపాడు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండకు జోడిగా మెహ్రీన్ నటించింది.


Click it and Unblock the Notifications











