twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కారులేదు.. జూ ఎన్టీఆర్ అప్పుడు సొంత ఆటోలో తాతను కలిసేందుకు వెళ్లేవాడట!

    |

    Recommended Video

    NT Rama Rao Driver Lakshman Comments On Jr NTR || Filmibeat Telugu

    తాతయ్య ఎన్టీ రామారావు వాసరత్వంతో సినిమాల్లో రావడమే కాదు.. ఆయన పేరు బెట్టిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూ ఎన్టీఆర్. ఏదైనా సందర్భంలో తాతయ్యను గుర్తు చేసుకోవాల్సి వస్తే భావోద్వేగానికి గురవుతుంటాడు యంగ్ టైగర్.

    చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తాతయ్య అంటూ తిరిగేవాడిని...ఆయన గురించి తెలిశాక రామారావు గారు, అన్నగారు అంటూ పిలవాలనిపించేది అంటూ గతంలో ఓ సందర్భంలో యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు వద్ద పని చేసిన లక్ష్మణ్ ఈ తాత మనవళ్ల మధ్య అనుబంధం ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు.

    అపుడు జూ ఎన్టీఆర్ శంకర్ మఠ్ వద్ద ఉండేవారు

    అపుడు జూ ఎన్టీఆర్ శంకర్ మఠ్ వద్ద ఉండేవారు

    ‘‘సార్ అబిడ్స్‌ ఇంట్లో ఉండే సమయంలో... జూ ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి నల్లకుంటలోని శంకర్‌మఠ్ సమీపంలో ఉండేవారు. అప్పుడు తాతను కలిసేందుకు వాళ్ల అమ్మ వండిన పదార్థాలు క్యారేజ్ కట్టుకుని రామకృష్ణ స్టూడియోకు వచ్చేవాడు'' అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

    ‘‘ఏం తాత ఏం తెచ్చావ్'' అనేవారు

    ‘‘ఏం తాత ఏం తెచ్చావ్'' అనేవారు

    జూ ఎన్టీఆర్ రాగానే... పెద్దాయన ‘‘ఏం తాత ఏం తెచ్చావ్'' అనేవారు. తిన్న తర్వాత సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో మేము వెళ్లే కారులోనే వస్తుండేవాడు. శంకర్‌మఠ్ మెయిన్ రోడ్డు మీద కారు ఆపితే... దిగి నడుచుకుంటూ వెళ్లేవాడు. బాబు ఇంటికి వెళ్లే వరకు పెద్దాయన కారులోనే ఉండి చూసేవారని లక్ష్మణ్ తెలిపారు.

    అపుడు వారికి కారు లేదు, సొంతగా ఆటో ఉండేది

    అపుడు వారికి కారు లేదు, సొంతగా ఆటో ఉండేది

    అపుడు వారికి కారు లేదు, సొంతగా ఆటో ఉండేది. ఆ ఆటోలోనే వచ్చేవాడు. ఆయన్ను దించి ఆటో వెళ్లిపోయేది. వెళ్లేపుడు మేము కారులో తీసుకుని వెళ్లేవారం. ఆ చిన్న వయసులోనే జూ ఎన్టీఆర్ సార్ సినిమాల డైలాగులు అద్భుతంగా చెప్పేవారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

    అపుడు నిజంగానే కప్పుకొట్టాడు

    అపుడు నిజంగానే కప్పుకొట్టాడు

    ఓసారి రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంటే సార్ తన మేకప్ మేన్ ముత్తుతో దగ్గరుండి జూ ఎన్టీఆర్‌కు మేకప్ వేయించారు. మేకప్ పూర్తయ్యాక ఆయనే స్వయంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చి... పోరా తాత ఫస్ట్ ఫ్రైజ్ కొట్టుకొస్తావు పో అని పంపేవారు. నిజంగానే జూనియర్ కప్ కొట్టాడు.

    ‘ఒరేయ్ నువ్వు నా పేరు నిలుపుతావురా' అనేవాడు

    ‘ఒరేయ్ నువ్వు నా పేరు నిలుపుతావురా' అనేవాడు

    కప్పు పట్టుకుని తాతయ్య వద్దకు రాగానే... ‘ఒరేయ్ నువ్వు నా పేరు నిలుపుతావురా' అనేవాడు. వాళ్ల అమ్మ శాలిని స్టూడియోకు వచ్చేవారు కాదు. ఓసారి నన్ను ఆమె వద్దకు హరిబాబు తీసుకెళ్లారు. ఆ ఒక్కసారి తప్ప ఆమెను ఎప్పుడూ కలవలేదని లక్ష్మణ్ వెల్లడించారు.

    English summary
    "In childhood, he lived with mother Shalini in Nallakunta area. He came in an autorickshaw to meet his grandfather.’’ NT Rama Rao driver Lakshman about Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X