NTR30: కొరటాల శివ హై వోల్టేజ్ ప్లాన్.. ఆ యాక్షన్ సీక్వెన్స్‌కు గూస్ బంప్స్ పక్కా!
కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో NTR30 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ హిట్ పెయిర్ కాంబోలో వస్తున్న NTR30 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలా ఉండేలా చూసుకుంటున్నారట మూవీ మేకర్స్. కమర్షియల్ తరహాలో ఉంటూనే సామాజిక సమస్యలను ప్రశ్నించేలా కథ ఉంటుందని టాక్.
కొన్ని వారాల క్రితమే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని, సినిమాలోని పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే NTR30 లో ఓ సన్నివేశంలో తారక్ కనిపించనున్న తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

NTR30 లో తారక్ ను ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా చూస్తామని అంటున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. బజ్ నిజమైతే ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ను రెజ్లింగ్ పైట్ లో చూస్తామని తెలుస్తోంది. అంటే తారక్ రెజ్లర్ గా కనిపిస్తాడు. ఈ ఫైట్ సీన్ గురించి మూవీ మేకర్స్ చర్చోపచర్చలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఫైట్ సీన్ కోసం ఎన్టీఆర్ తన శరీరాన్ని పూర్తిగా మార్చేసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. గతంలో ఏ హీరో కూడా ఇలాంటి పని చేయలేదని, ఈ సీన్ లో తారక్ తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడని అంటున్నారు.

ప్రస్తుతం NTR30 చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫైట్ సీన్ల కోసం ప్రత్యేకంగా కోట్లాది రూపాయలతో ఓ భారీ రైల్ సెట్ ను నిర్మించారట. ఆ సెట్ లోని నిర్విరామంగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ అయిపోగానే అదే సెట్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











