NTR 30: జూనియర్ ఎన్టీఆర్ అంచనాలను అందుకోలేకపోతున్న కొరటాల.. అందుకే ఆలస్యం?
RRR సినిమా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నుంచి ఇప్పటికే ఒక సినిమా వచ్చింది. అంతేకాకుండా మరో సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే ఆ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టలేదు. కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్టీఆర్ ఇంకా ఆ సినిమాను షూటింగ్ ని అనేక కారణాల వలన ఇంకా చర్చలలో ఉంసిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ కారణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

రాజమౌళి తరువాత
రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరికీ కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. అటు బాక్స్ ఆఫీస్ పరంగాను ఇటు క్రేజ్ పరంగాను సినిమా అన్ని విధాలుగా వారి భవిష్యత్తు ప్రాజెక్టులకు మంచి బూస్ట్ ఇచ్చే విధంగా సక్సెస్ అయింది. కానీ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంటు ప్రకారం ఆయనతో సినిమా చేసిన తర్వాత తప్పనిసరిగా డిజాస్టర్ ఎదుర్కోవాలి అనే ఒక బ్యాడ్ సెంటిమెంట్ అయితే చాలా కాలం కొనసాగుతోంది. ఇప్పటికే ఆచార్య సినిమాతో రామ్ చరణ్ డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని..
అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంతకుముందు రాజమౌళితో సినిమాలు చేసిన తర్వాత అపజయాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కొరటాలతో చేయబోయే సినిమాతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. అందుకే కొరటాల శివ కథ సిద్ధం చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఎన్నో చర్చల తర్వాత గాని అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వలేదు.

ఆచార్య తరువాత
అయితే ఆచార్య సినిమా ముందు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా కండిషన్స్ లేకుండానే కొరటాల శివతో తన కొత్త సినిమాను వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం తన సినిమాపై కూడా పడే అవకాశం ఉంది కాబట్టి స్క్రిప్ట్ విషయంలో మాత్రం మరోసారి దీర్ఘంగా ఆలోచించాలని కూడా కొరటాల శివతో చాలాసార్లు చర్చలు జరిపాడు.

మరో టాక్
RRR సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఎంత మాత్రం వదులుకోవద్దు అని ఎన్టీఆర్ చాలా మొండి పట్టుతో ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తానికి కొరటాల శివ సెలెక్ట్ చేసుకున్న కథ విషయంలో కూడా చాలా వరకు మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ కథ విషయంలో అంతకు కాన్ఫిడెంట్ గా లేడని కూడా ఆ తర్వాత మళ్లీ కొరటాల శివ మరో కథను కూడా చెప్పినట్లు మధ్యలో ఒక మరొక టాక్ వినిపించింది.

ఎప్పుడు ఒప్పిస్తాడో
అయితే రీసెంట్ గా మళ్లీ కొరటాల శివ పుల్ స్క్రిప్ రెడీ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాక పూర్తిస్థాయిలో మెప్పించలేదని కూడా కొత్త కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే ఈ ప్రాజెక్టును గత రెండు నెలల క్రితమే స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రైక్ నడవడంతో అది అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నారు. అది అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మరి కొరటాల ఎన్టీఆర్ కు ఎప్పుడు ఒప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











