Devara: క్రూరమైన జంతువుతో ఎన్టీఆర్ ఫైట్.. RRRకు మించిన సీక్వెన్స్.. ఇండియాలో ఏ హీరో చేయని విధంగా!

పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా ఎన్నో విభాగాల్లో రాణిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్.. 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటో మీరే చూడండి!

'దేవర'గా ఎన్టీఆర్ అరాచకం:కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న సినిమానే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

NTR and Shark Fight Will Be Major Highlight in Devara Movie

స్పీడుగా సాగుతోన్న షూటింగ్:ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన చాలా భారీ యాక్షన్ షెడ్యూళ్లను యమ స్పీడుగా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దాన్ని కూడా ప్లాన్ చేశారు. ఇలా వీలైనంత త్వరగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేయాలని చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది.

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్.. హై ఓల్టేజ్:సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీ ఇండియాలో ఎవరూ చూడని కోస్టల్ ఏరియా (సముద్ర భాగం)కు సంబంధించిన బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. ఈ విషయాన్ని కొరటాల శివ ముందే రివీల్ చేశారు. అంతేకాదు, ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో క్రేజీ ఎలిమెంట్లను చూపించబోతున్నారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిస్తున్నారు.

NTR and Shark Fight Will Be Major Highlight in Devara Movie

యాక్షన్ ఎపిసోడ్‌లతో రచ్చ:మామూలుగా కొరటాల శివ సినిమాలు అంటేనే సోషల్ మెసేజ్‌లతో కూడి ఉంటాయి. అయితే, తొలిసారి ఎన్టీఆర్ కోసం ఆయన 'దేవర' మూవీని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ఎన్నో భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉంటాయని అంటున్నారు. వాటిలో ఎక్కువగా సముద్ర జలాలపై చిత్రీకరించేవి ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది.

NTR and Shark Fight Will Be Major Highlight in Devara Movie

షార్కుతో ఎన్టీఆర్ ఫైటింగ్:ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు, షార్క్ (సొరచేప)కు మధ్య భీకరమైన ఫైటింగ్ జరుగుతుందట. ఈ ఎపిసోడ్‌ను హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌తో చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భారీ సముద్రపు సెట్‌ను కూడా ఏర్పాటు చేశారట.

NTR and Shark Fight Will Be Major Highlight in Devara Movie

ఫ్లాష్‌బ్యాక్‌లో.. తొలి హీరోగా:పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'దేవర' మూవీలో ఎన్టీఆర్ - షార్క్ ఫైట్ RRRలో ఇంట్రో సీన్ కంటే హై రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా ఇందులో ఎన్టీఆర్ సాహసాలు చేస్తున్నాడని తెలిసింది. ఈ సన్నివేశం కోసం విదేశీ టెక్నాలజీని వాడుతున్నారని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X