NTR30: రూమర్స్ కు చెక్ పెడుతూ అఫీషియల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. చర్చల్లో ఆ ముగ్గురు!

జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాను ఎనౌన్స్ చేసి చాలా కాలం అయినప్పటికీ కూడా ఇంకా సినిమా షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను కొంత కన్ఫ్యూజన్ కి గురి చేశారు. ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే తరహాలో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.

ఇక ఎన్టీఆర్ కు కొన్ని సందేహాలు ఉండడం వలన కొరటాల శివ కథ లో మార్పులు చేస్తున్నాడు అని అలాగే కథ సెట్ కాకపోవడంతో మరో కథను కూడా సెట్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోవడం వలన దాదాపు నిజమని కూడా అనుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచి షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వచ్చింది.

Ntr arts official update on Jr ntr 30th project latest pics viral

ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా రత్నవేలుని ఫిక్స్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా బాహుబలి ఫేమ్ సబు సిరిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ మొదటిసారి ఎన్టీఆర్ 30 పై అధికారికంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నట్లు ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. కొరటాల శివ, సినిమాటోగ్రఫర్, ఆర్ట్ డైరెక్టర్ తో చర్చలు కొనసాగిస్తూ ఉన్నట్లు ఫొటోలు రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఫైనల్ గా ఒక నిజమైన క్లారిటీ అయితే వచ్చింది.

ఇక సినిమా క్యాన్సిల్ అయినట్లు వస్తున్న రూమర్స్ కు కూడా చెక్ పడినట్లు అయ్యింది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమాను బిగ్ బడ్జెట్ ఫ్యాన్ ఇండియన్ మూవీగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను వెండితెరపైకి తీసుకు రానున్నాడు. ఇక సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X