Devara: ఓవర్సీస్ లో ‘దేవర’ ప్రభంజనం.. రిలీజ్ ముందే బ్రేక్ ఈవెన్?
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. సన్సెషల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దేవర ప్రీ సేల్స్బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా పలు రికార్డులకు క్రియేట్ చేసింది.
ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్న దేవర మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 160 కోట్ల రూపాయలు వెచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. ప్రమోషనల్ విషయం లో కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అన్ని ఖర్చులు కలిసి ఈ మూవీ 165 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్స్ భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అభిమానుల్లో, సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. కాగా ఇటీవల దేవర ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగోట్టాయి. నెల రోజుల కిందటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, అమెరికా, కెనడాలో ప్రారంభం కాగా విశేష ఆదరణ లభిస్తున్నది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో సినిమా అడ్వాన్స్ బుకింగ్ నుండి స్పష్టంగా కనిపిస్తుంది.

ఓవర్సీస్‌లో దేవర బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 6.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రీమియర్స్ ప్లస్ ,డే 1 అడ్వాన్స్ సేల్స్‌లో దేవర దుమ్మురేపింది. పక్కా ఊరమాస్ గా వస్తున్న దేవర అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు రూ. 2.6 మిలియన్ డాలర్లను ముందే వసూలు చేసింది. దాంతో ఎన్టీఆర్ కెరీర్‌లో నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, RRR తర్వాత రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసిన నాలుగో చిత్రంగా దేవర ఘనతను సాధించింది.
ఈ కలెకన్లతో దాదాపు 41 శాతం రికవరీ సాధించింది. అయితే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో దేవర ఇప్పటికే 53 శాతం రికవరీని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేవర విడుదలకు ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఇప్పటివరకు 60k టికెట్స్ బుక్ అయి రికార్డు సృష్టించింది దేవర. రిలీజ్ నాటికీ నాటికీ బ్రేక్ ఈవెన్ సాధించి విడుదలకు ముందే కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందనీ, రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ కు లాభాల పంట పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచన వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











