‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ నుంచి బ్రేక్: దుబాయ్‌లో ల్యాండైన జూ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. తాజా షెడ్యూల్‌లో తన షూటింగ్ పార్ట్ ముగియడంతో యంగ్ టైగర్ ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ వేశారు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఉన్నట్టుండి ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ వేయడం వెనక మరో కారణం కూడా ఉందట. 'ఆర్ఆర్ఆర్' మూవీకి సంబంధించిన ఓ పని కూడా పూర్తి చేయడానికి అబు దుబాయ్ వెళతారని టాక్. ఈ నెలాఖరు వరకు తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం.

గతేడాది ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి యూఎస్ఏ వెళ్లారు. గ్రాఫిక్స్ సంబంధించిన ఒక స్టింట్ పూర్తి చేశారు. తాజాగా ఎన్టీఆర్ మీద షూటింగ్ పూర్తి కావడంతో గ్రాఫిక్స్‌కు సంబంధించిన స్టింట్ పూర్తి చేయడానికి దుబాయ్ వెళ్లారని, పనిలో పనిగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ చరణ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీని రూ. 300 కోట్ల ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











