RRR ఓ సంచలనం.. మిమ్మల్ని నిరాశకు గురిచేశాం.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ ఎమోషనల్ లేఖ

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు మే 20వ తేదీన జన్మదినం జరుపుకోనున్నారు. అయితే ఈ ఏడాది తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌‌లో ఉన్నాయి. ప్రజలందరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వలస ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ ఎన్టీఆర్‌నే కాకుండా ప్రతీ ఒక్కరిని మనస్తాపానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తన అభిమానులకు ఎన్టీఆర్ భావోద్వేగమైన లేఖను రాశారు. ఆ లేఖలో ఏం రాశారంటే..

కరోనా విపత్తు సమయంలో

కరోనా విపత్తు సమయంలో

కరోనా విపత్తు సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నాను. ఇలాగే మనమంత సంయమనం పాటిస్తే మహమ్మారిపై విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. కాబట్టి మీరంతా ఇంటి పట్టునే ఉండి సురక్షితంగా ఉండాలి అని ఎన్టీఆర్ అన్నారు.

ప్రతీ ఏటా నా పుట్టిన రోజును

ప్రతీ ఏటా నా పుట్టిన రోజును

ప్రతీ ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉంటాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి అని ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

RRR చిత్రం నుంచి

RRR చిత్రం నుంచి

అలాగే RRR చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్‌లుక్ లేదా టీజర్ విడుదల కావడం లేదనే విషయ మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్ధం చేసుకొంటాను. ఫస్ట్‌లుక్ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందనేది నాకు తెలుసు. కానీ ప్రచార చిత్ర మీ ముందు ఉండాలంటే, అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. లాక్‌డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు అని ఎన్టీఆర్ వెల్లడించారు.

రాజమౌళి దర్శకత్వంలో RRR ఓ సంచలనం

రాజమౌళి దర్శకత్వంలో RRR ఓ సంచలనం

ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుందుతోన్న RRR చిత్రం ఓ సంచలనం కలిగిస్తుందనే నా నమ్మకం. ఆ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. బర్త్ డే విషయంలో నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ ఎన్టీఆర్ తన లేఖను ముగించారు.

Recommended Video

NTR Birthday : RRR Team Fail To Deliver Bheem Glimpse First Look Video
ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్‌ను

ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్‌ను


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేఖను విడుదల చేయడానికి కొద్ది సేపటి ముందు RRR యూనిట్ ఓ లేఖను విడుదల చేసింది. లాక్‌డౌన్ కారణంగా తాము ఎన్టీఆర్‌ పాత్ర భీమ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేకపోతున్నాం. త్వరలోనే దానిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ రోజు అసలు పండగను జరుపుకొందామని తమ అభిప్రాయాన్ని RRR యూనిట్ తమ లేఖలో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X