అరవింద్ సమేత ఆడియో: గంభీరంగాఎన్టీఆర్ ఎంట్రీ... అన్నయ్య చేయి పట్టుకుని, బాధను దిగమింగి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' మూవ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా మొదలైంది. వేడుక ప్రారంభమైన కొంతసేపు తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ వేదిక వద్దకు ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ గట్టిగా అరుస్తూ స్వాగతం పలికారు.
ఆడియో వేడుక వేదిక వద్దకు వచ్చే ముందు ఎన్టీఆర్ చాలా గంభీరంగా కనిపించారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ చేయి పట్టుకుని బాధను దిగమింగుకుని వస్తున్నట్లు అతడి ముఖం కనిపించింది. ఇటీవలే తన తండ్రి హరికృష్ణను కోల్పోయిన ఎన్టీఆర్... ఆ బాధ నుండి ఇంకా బయటకు రాలేదని స్పష్టమవుతోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది.
'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











