చాలా కాలం తరువాత బయటకు వస్తున్న ఎన్టీఆర్.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న ఫ్యాన్స్
ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా తన అభిమానుల ముందుకు రాబోతున్నారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగబోతుండగా దానికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకుంటున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొత్త దర్శకుడు
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాలేదు. తొలిసారిగా ఆయన ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తన సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీ ప్రీ రిలీజ్ కోసం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికకు హాజరు కాబోతున్నారు. చాలా కాలం నుంచి సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ వశిష్ట మల్లిడి అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు.

శిల్పకళా వేదికకు
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత ఎన్టీఆర్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ మీద తన బావ మరిది కొసరాజు హరికృష్ణతో నిర్మింప చేశారు ఈ సినిమాలో సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్, కేథరిన్ థెరిసా వంటి వారు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ శిల్పకళా వేదికకు చేరుకుంటున్నారు.

కటౌట్లు
ఇప్పటికే హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద భారీ ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు పాలాభిషేకాలు వంటివి కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులకు శిల్పకళా వేదికకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా గ్రాండ్గా చేసింది.

టైం ట్రావెల్
ఇక ఈ సినిమాతో కచ్చితంగా కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టగలరని ఆయన భావిస్తున్నాడు. బింబిసారుడు అనే ఒక రాజు అనూహ్యంగా ఒక ప్రమాదం వలన టైం ట్రావెల్ చేసి నేటి ఆధునిక యుగానికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో నుంచి ఎలా బయట పడి మళ్ళీ తన సమయానికి వెళ్ళాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

నైజాం ప్రాంతంలో
ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బడా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు దిల్ రాజు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











