Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్ కంప్లీట్!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. తాజాగా పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర గ్రాండ్ రిలీజ్ కు సర్వం సిద్ధం అయినట్లు అయింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటించాడు. చంద్రబాబు పాత్రని ఏ కోణంలో చూపించారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు చాలా కీలక పాత్ర పోషించారు. బాలయ్య, రానా మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయని సినీ, రాజకీయ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు నిరాశ పరచడం మహానాయకుడు చిత్రానికి కాస్త ప్రతికూలాంశమే అని చెప్పొచ్చు. మనాయకుడుతో అయినా బాలయ్య మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.