ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బాక్సాఫీస్‌కే కంగారు.. చిరు, మహేష్ సరసన..!

అరవింద సమేతకు ముందు భారీ విజయాలు సాధించినప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మాత్రం కలెక్షన్ల పరంగా మిగితా సూపర్‌స్టార్ల కంటే వెనుకబడి ఉన్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రూ.75 కోట్ల షేర్ సాధించిన వారిలో కేవలం నలుగురు లేదా ఐదుగురు హీరోలు ఉన్నారు. దాంతో ఆ మార్క్‌ను దాటలేకపోతున్న ఎన్టీఆర్‌కు ఆ నంబర్ కంగారు పెట్టింది. కాకపోతే ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన అరవింద సమేత.. యంగ్‌టైగర్‌ను రూ.75 మార్కును కూడా దాటింది. వివరాల్లోకి వెళితే..

రూ.75 కోట్ల క్లబ్‌లో

రూ.75 కోట్ల క్లబ్‌లో

ప్రభాస్, మహేష్, చిరంజీవి, రాంచరణ్, విజయ్ దేవరకొండ రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించడమే కాకుండా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన రూ.75 కోట్ల నికర మార్కును సాధించారు. అరవిందకు ముందు ఎన్టీఆర్‌ ఈ మార్కును దాటడానికి శ్రమపడ్డారు.

ప్రభాస్, చిరంజీవితో

ప్రభాస్, చిరంజీవితో

బాహుబలి సినిమాతో ప్రభాస్ రూ.75 కోట్లకుపైగా షేర్ సాధించిన హీరోగా మారాడు. అలాగే ఖైదీ నంబర్ 150తో చిరంజీవి ఆ మార్కును అధిగమించారు. భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలతో ప్రిన్స్ మహేష్ రూ.75 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

రాంచరణ్, విజయ్ దేవరకొండలకు

రాంచరణ్, విజయ్ దేవరకొండలకు

ఇక యువ హీరోలు రాంచరణ్, విజయ్ దేవరకొండ ఎలాంటి కష్టం లేకుండానే రూ.75 కోట్ల షేర్ క్లబ్‌లో చేరిపోయారు. రంగస్థలం చిత్రం రాంచరణ్‌కు, గీత గోవిందం చిత్రం విజయ్ దేవరకొండను ఆ మార్క్ దాటేలా చేశాయి.

అరవింద సమేతతో ఎన్టీఆర్

అరవింద సమేతతో ఎన్టీఆర్

ఇక స్టార్ హీరోలలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఆ క్లబ్‌లో చేరడం మిగిలి ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి అరవింద సమేత.. వీర రాఘవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్నమైన నటనతో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. అలాగే రికార్డులను తిరగరాసే కలెక్షన్లను సొంతం చేసుకొన్నాడు.

ఎన్టీఆర్ రూ.100 కోట్ల షేర్‌తో

ఎన్టీఆర్ రూ.100 కోట్ల షేర్‌తో

గత 18 రోజుల్లో అరవింద సమేత చిత్రం రూ.165 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అలాగే రూ.100 కోట్ల షేర్ సాధించడంతో రూ.75 కోట్ల మార్కును ఎన్టీఆర్ అవలీలగా దాటేశాడు. దాంతో టాలీవుడ్‌ హీరోల స్టామినాకు మైలురాయిగా నిలిచిన ఆ రికార్డును ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకోవడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X