twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐటంలా ఉండదు: ‘అరవింద సమేత’లో సిక్స్ ప్యాక్ బాడీపై ఎన్టీఆర్

    |

    'అరవింద సమేత' మూవీలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడని ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి ముందు కూడా ఎన్టీఆర్ ఈ సినిమాలో పాత్ర కోసం బరువు తగ్గుతున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ 11న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో బిజీ అయిపోయిన ఎన్టీఆర్-త్రివిక్రమ్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ఫ్యాక్షన్ లీడర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాలనే థాట్ ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు త్రివిక్రమ్ ఆసక్తికరంగా స్పందించారు.

    Recommended Video

    NTR Interview About Aravinda Sametha

    నా స్వార్థం కూడా ఉంది, ఆ గాయం పచ్చిగానే, పార్టీ విషయం ఆలోచించలేదు: ఎన్టీఆర్నా స్వార్థం కూడా ఉంది, ఆ గాయం పచ్చిగానే, పార్టీ విషయం ఆలోచించలేదు: ఎన్టీఆర్

     అప్పుడే ఆ ఆలోచన వచ్చింది

    అప్పుడే ఆ ఆలోచన వచ్చింది

    ఎన్టీఆర్ ఎక్సర్‌సైజ్ చేస్తుంటే చూసినపుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఫిట్‌గా ఉందామనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ముందు ఎక్సర్ సైజ్ మొదలు పెట్టారు. ప్రత్యేకంగా ట్రైనర్‌ను పెట్టుకుని ఆర్గానిక్‌గా ఎలాంటి సప్లిమెంట్స్, మందులు వాడకుండా ప్రయత్నిస్తున్నాడు. మూడు నాలుగు నెలలు చాలా కష్టపడ్డాడు. ఆ సమయంలో ఆయన్ను చూసినపుడు నాకు ఈ ఆలోచన వచ్చింది అని త్రివిక్రమ్ అన్నారు.

    ఐటంలా చేద్దామనే ఉద్దేశ్యం లేదు

    ఐటంలా చేద్దామనే ఉద్దేశ్యం లేదు

    సిక్స్ ప్యాక్ బాడీ వాడటానికి మనకు ఒక సన్నివేశం కూడా ఉంది కాబట్టి దాన్ని అండర్ లైన్ చేయాలనిపించింది. అంతే కానీ దాన్నొక ఐటం చేద్దామనే ఉద్దేశ్యం అయితే కాదు అని త్రివిక్రమ్ అన్నారు. ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ అదొక ఐటం లా ఉండదు, సినిమాలో చూసిన కూడా చాలా నేచురల్ గా కనిపిస్తుంది... అన్నారు.

    బలవంతంగా బాడీ చూపిస్తున్నట్లు ఉండకూడదు

    బలవంతంగా బాడీ చూపిస్తున్నట్లు ఉండకూడదు

    సిక్స్ ప్యాక్ బాడీ కనిపించే సీన్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో త్రివిక్రమ్ చాలా గొప్పగా డిజైన్ చేయించారు. బలవంతంగా బాడీ చూపిస్తున్నాడు అనే విధంగా ఉండకూడదు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్‌లో ఈ సీన్ వస్తుంది. చాలా నేచురల్‌గా ఫ్లో అవ్వాలి. మేము అనుకున్న విధంగా చాలా బాగా సీన్ వచ్చింది.. అని ఎన్టీఆర్ తెలిపారు.

    అలా అయితే మాకూ ఇబ్బందే

    అలా అయితే మాకూ ఇబ్బందే

    ఒక్కోసారి ఇలాంటి సీన్లు చేసినపుడు అన్ కంఫర్టబుల్ అయిపోతాం. ఇదేంటి కావాలని బాడీ చూపిస్తున్నామా? అనేలా ఉండకుండా జాగ్రత్త పడతాం. వీడు బాడీ చూపిస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రాకుండా జాగ్రత్తపడాలి. ప్రేక్షకుల్లో అలాంటి ఫీలింగ్ వస్తే మాకూ ఇబ్బందిగానే ఉంటుంది అని ఎన్టీఆర్ తెలిపారు.

     కండలు ఉన్నాయని ఫోజులు కొట్టలేదు

    కండలు ఉన్నాయని ఫోజులు కొట్టలేదు

    ఒక వ్యక్తి ఎమోషనల్‌గా వెళుతున్నాడు. పైన చొక్కాలేదు. చొక్కా ఒకటే లేదు కానీ ఆ ఎమోషనల్ అలాగే కంటిన్యూ అవుతూ సీన్ తీసుకొచ్చారు. అంతే కానీ నా కండలు ఇలా ఉన్నాయి, ఇది ఇలా ఉంది అని ఫోజులు కొట్టే విధంగా అయితే ఉండదు... అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.

    English summary
    Trivikram Reveals the Secret behind NTR's Sixpack Look in the movie. Aravinda Sametha Telugu Movie ft. Jr NTR and Pooja Hegde. Directed by Trivikram Srinivas and Produced by S. Radha Krishna under Haarika & Hassine Creations. Music Composed by Thaman S.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X