త్రివిక్రమ్ నా మీద తోయడం తప్పు, విషాదం నిండిన మా ఇంట్లో నవ్వు రేఖ: ఎన్టీఆర్ సెన్సేషనల్ స్పీచ్

Recommended Video

Jr NTR Speech @Aravindha Sametha Success Press Meet

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో పాటు చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెన్సేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ దర్శకుడి గురించి మాట్లాడనంత గొప్పగా మాట్లాడటమే కాదు, ఆయన తనకు ఎంతటి ఆప్తుడో చెప్పే ప్రయత్నం చేశారు. పన్నెండేళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్నతరుణం ఈ సినిమాతో నిజం అయిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్ని వరుసలతో పిలిచాడో...

ఎన్ని వరుసలతో పిలిచాడో...

మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, అన్న, ఆత్మబంధువు, మా అమ్మకు ఇంకో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న, నాకు బావ... ఎన్ని బంధాలతో పిలిచినా పలికే నా ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక చిత్రం చేయాలని పన్నెడేళ్లుగా ఎదురు చూసినట్లు ఎన్టీఆర్ తెలిపారు.

నా గుండె లోతుల్లో గర్వంగా...

నా గుండె లోతుల్లో గర్వంగా...

ఆయనతో సినిమా చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో ఆ చిత్రం చిర స్థాయిగా మిగిలిపోవాలి. రేపు గర్వంగా నా పిల్లలకు ఆ చిత్రం చూపించుకోవాలి. గర్వంగా సమాజానికి ఈ చిత్రం చూపించి నేను కూడా గర్వంగా ఉండే స్థాయిలో ఉండాలని కోరుకున్న తరుణం మూడు రోజుల క్రితం అరవింద సమేత వీర రాఘవ సినిమాతో రానే వచ్చింది.... అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

 నా ఖాతాలో తోసేశాడు, అది తప్పు...

నా ఖాతాలో తోసేశాడు, అది తప్పు...

ఇందాక త్రివిక్రమ్ ఈ చిత్రం విజయం ఆయనది కాదు అంటూ నా ఖాతాలో తోసేయడం జరిగింది. ఇది ఎందుకు తప్పు అంటున్నానంటే... నేను మిమ్మల్ని నమ్మాను సరే, మిమ్మల్ని ఇంతగా నమ్మేలా చేసింది మీరే కదా... అంటూ తనదైన రీతిలో ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

 ఈ విషయం మరిచిపోయారా?

ఈ విషయం మరిచిపోయారా?

నటీనటులందరికీ, ప్రేక్షకులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విడుదలవుతుందంటే ఎందుకంత ఆసక్తిగా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు, మిమ్మల్ని చూసి మేము బయల్దేరడమే కానీ మమ్మల్ని చూసి మీరు బయల్దేరడం కాదు. ఈ విషయం మీరు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అరవింద సమేత వీర రాఘవ అనే విజయం మీ జర్నీలో భాగంగా మేమంతా కలిశామే కానీ మా జర్నీలో భాగంగా మీరు రాలేదు.... అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

ఆయన ఎంతో గొప్పగా వివరించారు

ఆయన ఎంతో గొప్పగా వివరించారు

సినిమాలని మొదటి 15 నుండి 20 నిమిషాల పాటు జరిగే యుద్ధపూరిత వాతావరణంలో నాగబాబుగారు చనిపోవడం జరుగుతుందో ఆ తర్వాత వచ్చే సీన్ ఆయన వల్లే చాలా బాగా చేశాను. చాలా చిత్రాల్లో నేను ఎమోషనల్‌గా చేశాను, కానీ త్రివిక్రమ్ నాకు వివరించిన తీరు ఎంతో గొప్పగా ఉంది అని ఎన్టీఆర్ అన్నారు.

 పాదాభివందం అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్

పాదాభివందం అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్

సినిమాలో ఒక నటుడి ప్రతి ఎమోషన్‌ను డ్రైవ్ చేసేది దర్శకుడు. ఒక నటుడికి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే. దర్శకుడు మా నటనను చూసి నేను అనుకుంటున్న కథలో, సీన్లో ఈ ఎమోషన్ పరిపూర్ణంగా వచ్చింది అని ఆయన నమ్మితేనే అది ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది. నేను అలా చేసిన 28 చిత్రాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ ఒక ఎమోషనల్ సీన్ వచ్చినపుడు ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. ఇలాంటి సినిమా మాకు అందించినందుకు పాదిభివందనాలు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

 ఇంతకు ముందు రెండు కథలు చెప్పారు కానీ..

ఇంతకు ముందు రెండు కథలు చెప్పారు కానీ..

ఈ సినిమా మొదలవ్వడానికి ముందు రెండు కథలు చెప్పారు. అయినా ఏదో సందిగ్ధం ఆయనలో కనిపించేది. ఫైనల్‌గా ఆయన అరవింద సమేత 20 నిమిషాల కథ చెప్పినపుడు ఆయన కళ్లలో ఒక స్పార్క్ చూశాను. ఆయన కూడా నా కళ్లలో ఆ స్పార్క్ చూశాడు. ఇద్దరిలో కథపై అంత నమ్మకం ఏర్పడింది కాబట్టే ఈ విజయం వరకు మా జర్నీ సాగింది అని ఎన్టీఆర్ అన్నారు.

విషాదం నిండిన మా ఇంట్లో నవ్వు రేఖ

ఈ రోజు మేమందరం ఇలా ఉన్నామంటే కారణం మా అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడూ మరిచిపోలేనిది. ఒక నల్లమబ్బు ఒక ప్రాంతాన్ని కమ్మేస్తే సూర్య కిరణాలు వచ్చి ఒక వెలుతురును తీసుకొస్తుంది... ఒక సంఘటన వల్ల విషాద ఛాయలు కమ్మిన మా ఇంట్లోకి నవ్వు రేఖని తీసుకొచ్చిన అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు, మీడియా వారు, సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి మొహంలో నవ్వు చూశాను. మీ అభిమానం లేకుంటే మేము కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. నాన్నగారు సడెన్‌గా వెళ్లిపోయేసరికి ఆయనకు ఏమీ ఇవ్వలేక పోయానే అనిపించింది, మా నాన్నగారికి ఈ విజయాన్ని గిఫ్టుగా ఇచ్చేలా చేసిన అందరికీ రుణపడి ఉంటాను అని ఎన్టీఆర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X