ఎన్టీఆర్ చెప్పినా వినని ఫ్యాన్స్.. అదే కావాలంటూ నందమూరి అభిమానుల రిక్వెస్ట్

హీరోలందరూ సినిమాలతో చేతినిండా సంపాదించడమే కాకుండా.. ప్రకటనలతోనూ ఫుల్‌గా వెనకేసుకుంటున్నారు. ఈ జాబితా దక్షిణాదిలోనే టాప్ స్టార్‌గా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. అది ఇది అని కాకుండా వచ్చిన ప్రతీ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి.. ప్రకటనల్లో నటించేస్తున్నాడు. అలా సినిమాలతోనూ, ప్రకటనలతోనూ నిత్యం బిజీగా ఉంటాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అదే బాటలో నటిస్తూ దాదాపు హీరోలందరూ యాడ్స్‌లో నటిస్తూ ఉన్నారు.

 దూరంగా ఉండే ఎన్టీఆర్ సైతం..

దూరంగా ఉండే ఎన్టీఆర్ సైతం..

ప్రకటనలకు దూరంగా ఉండే ఎన్టీఆర్ సైతం.. ఈ మధ్య యాడ్స్‌లో నటిస్తూ ఉన్నాడు. శీతల పానియమైనా యాపీ ఫిజ్‌కు గత కొంతకాలం నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిన సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా.. మనదగ్గర యంగ్ టైగర్ దుమ్ముదులుపుతున్నాడు. తాజాగా ఓట్టో అనే బ్రాండెడ్ దుస్తుల ప్రకటనలోనే మెరిశాడు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఎన్టీఆర్..

సోషల్ మీడియా అతి తక్కువస్థాయిలో వాడే స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఏదైనా పెద్ద సంఘటనలు జరిగితే తప్పా.. సోషల్ మీడియా వేదికపై రియాక్ట్ కాడు. అంతలా సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించే తారక్.. తాజాగా ఓ ట్వీట్ చేశాడు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే యాపీ ఫిజ్ కోసం ఓ ట్వీట్ చేశాడు.

యాపీ ఫిజ్‌తో మీ కాంబినేషన్..?

యాపీ ఫిజ్‌తో మీ కాంబినేషన్..?

యాపీ ఫీజ్‌తో కాంబినేషన్‌గా మీరు ఏది తినడానికి ఇష్టపడతారు? అని ఓ ప్రశ్నను అడిగేశాడు. ఓ కూల్ స్టఫ్‌ను కూడా పొందే అవకాశముందని తెలిపాడు. మరిన్ని వివరాల కోసం యాపీ ఫిజ్‌ను ఫాలో అవ్వండని పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ వేరే రకంగా స్పందించారు.

RRR అప్‌డేట్ ఇవ్వండి..

RRR అప్‌డేట్ ఇవ్వండి..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఆ కామెంట్లను చూస్తేనే అర్థమవుతోంది. యాపీ ఫిజ్‌పై స్పందించకుండా.. అప్‌డేట్ కావాలంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తించారు. ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఇలా ఏదో ఒకటి వదలండంటూ ఎన్టీఆర్, రాజమౌళికి విన్నవించుకుంటున్నారు. మరి వీరి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
ఫస్ట్ లుక్ అని చెప్పి వెనకడుగు..

ఫస్ట్ లుక్ అని చెప్పి వెనకడుగు..

కొమురం భీమ్ జయంతి (అక్టోబర్ 22) సందర్భంగా ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తామని ప్రకటించారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ ఆరోజంతా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. ఎన్టీఆర్ లుక్ విడుదల కాకపోవడంతో అభిమానులంతా నిరాశ చెందారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X