NTR: ప్రాణాపాయంలో ఉన్న అభిమానికి వీడియో కాల్.. నేనున్నానంటూ అభయం.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరి ఫాన్స్ ఒకెత్తయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకెత్తు. కనీసం ఎన్టీఆర్ తో సంబంధం కూడా లేకుండా వారే ఎన్టీఆర్ పేరు మీద ట్రస్ట్ పెట్టి తమ అభిమానులకే కాక ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అభిమానులు మీద ఎన్టీఆర్ కూడా చాలా ప్రేమ కనబరుస్తూ ఉంటారు. ఇప్పుడు తన అభిమాని కోసం ఎన్టీఆర్ చేసిన ఒక పని ఇప్పుడు ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

 రోడ్డు ప్రమాదంలో

రోడ్డు ప్రమాదంలో

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడవల్లి అనే గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. రోడ్డు ప్రమాదం ధాటికి ఆయన రెండు కిడ్నీలు కూడా పాడైపోయాయి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయన నోటి నుంచి కనీసం మాటలు కూడా రావడం లేదంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు..

 పేపర్ మీద రాసిచ్చి

పేపర్ మీద రాసిచ్చి

అయితే ఇంకా ఎక్కువ రోజులు బతకాలని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మురళి డాక్టర్లకు తనకు ఎన్టీఆర్ తో మాట్లాడాలి అని ఉందనే విషయాన్ని వెల్లడించాడు ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన మురళి తనకు ఎన్టీఆర్ తో మాట్లాడాలని ఉంది అనే విషయాన్ని ఒక పేపర్ మీద రాసి డాక్టర్ కి ఇచ్చాడు.. డాక్టర్ కి కూడా ఆ చిరకాల కోరిక విని ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు.

మురళికి ఎన్టీఆర్ ఫోన్

మురళికి ఎన్టీఆర్ ఫోన్

తాను ఏం చేయగలను అని ఆలోచించి ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు రాయుడు బాబ్జి అలాగే భాస్కర్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ కు తెలియజేశారు. వారు కూడా వెంటనే ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. తను ప్రాణంగా ప్రేమిస్తున్న అభిమాని చివరి కోరిక విని చలించి పోయిన ఎన్టీఆర్ వెంటనే వీడియో కాల్ చేసి అభిమానిని పరామర్శించారు. తాను ఒక దైవంగా భావించే ఎన్టీఆర్ తనకు ఫోన్ చేశాడు అనే విషయం తెలిసి మురళి చాలా ఆనందం వ్యక్తం చేశాడు.

 మళ్ళీ కలుద్దామన్న ఎన్టీఆర్

మళ్ళీ కలుద్దామన్న ఎన్టీఆర్

మాట్లాడ లేని పరిస్థితుల్లో కూడా నేను సంపూర్ణ ఆరోగ్యం తో మరో మూడు నెలల్లో తిరిగి బయటకు వస్తానని ఎన్టీఆర్ కు చెప్పడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎన్టీఆర్ కూడా నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తావని వచ్చాక మళ్ళీ కలుద్దాం అని ధైర్యం చెప్పారు. నువ్వు త్వరగా కోలుకుంటాడు త్వరలోనే మనం కలుద్దామని ఎన్టీఆర్ మురళికి అతని కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ చెప్పే విధంగా

ఎప్పుడూ చెప్పే విధంగా

అయితే ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఎన్టీఆర్ తన అభిమానులు ఎప్పుడూ హెచ్చరిస్తుంటారు. తన ఇంట్లో జరిగిన నష్టం మరే ఇంట్లో జరగకూడదు అంటూ ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. మురళి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు అనే విషయం తెలుసుకుని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ గ్యాప్ లోనే ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక షో కూడా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X