NTR Birthday Celebrations ఇంటి వద్ద లాఠీఛార్జిపై ఎన్టీఆర్ స్పందన.. క్షమాపణలు చెబుతూ యంగ్ టైగర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20బా తారీఖున కావడంతో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి విషెస్ చెబుతూ వస్తున్నారు. దీనితో సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరే కనిపిస్తోంది. అయితే ఆయనను చూడడం కోసం ఆయన ఇంటికి వెళ్ళిన అభిమానులు లాఠీ ఛార్జ్ కారణంగా దెబ్బలు తిన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ మెసేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

RRR సినిమాతో

RRR సినిమాతో


చివరిగా RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో 30వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్ 31వ సినిమా అనౌన్స్ చేశాడు.

 అర్ధ రాత్రి సమయంలో

అర్ధ రాత్రి సమయంలో


ఇక ఆయన పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ తదుపరి సినిమాలకు సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ సంగతి పక్కన పెడితే గురువారం అర్థరాత్రి ఎన్టీఆర్ అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు.

ఇంట్లో లేకపోవడంతో

ఇంట్లో లేకపోవడంతో


కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో ఆయన రాక కోసం రోడ్డు మీదే ఎదురుచూశారు. కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి హడావిడి చేస్తూ రచ్చ చేశారు. ఈ క్రమంలో అదే రోడ్డు మీద రాకపోకలు జరపాల్సిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని.. అభిమానులను వేరే చోటకు తరలించారు.

హృదయపూర్వక ధన్యవాదాలు

హృదయపూర్వక ధన్యవాదాలు


ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ని షేర్ చేశారు ఎన్టీఆర్. 'నా స్నేహితులకు, ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, ఇండస్ట్రీలో కలిసి పని చేసిన కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మాత్రమే కాక నాకు విషెస్ చెప్పడానికి ఇంటివరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.

 మిమ్మల్ని కలవలేకపోయాను

మిమ్మల్ని కలవలేకపోయాను


మీరు నాపై చూపిన ప్రేమ ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మార్చిందని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. అయితే నేను ఇంట్లో లేకపోవడంతో మిమ్మల్ని కలవలేకపోయాను.. దానికి క్షమించమని కోరుతున్నాను. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అంటూ ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు. ఇక త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమా షూట్ పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొనాల్సి ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X