ఎన్టీఆర్ కొత్త సినిమా అప్‌డేట్‌కు టైమ్ ఫిక్స్: అలా హింటిచ్చిన నిర్మాత.. ఆ డైరెక్టర్‌తోనే మరోసారి

యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, పాటలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్‌తో సత్తా చాటాడు. మధ్యలో పరాజయాలు పలకరించినా.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ తర్వాతి సినిమా గురించి అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత చేసిన ఓ పోస్ట్ మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

వరుసగా ఐదు హిట్లు... సూపర్ ఫామ్‌లో

వరుసగా ఐదు హిట్లు... సూపర్ ఫామ్‌లో

చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని తారక్.. ఆ తర్వాత వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.

మెగా హీరోతో కలిసి.. ప్రతిష్టాత్మక చిత్రంలో

మెగా హీరోతో కలిసి.. ప్రతిష్టాత్మక చిత్రంలో

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరిలా, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తన్నారు.

ఆయనతో రెండోసారి.. పొలిటికల్ నేపథ్యం

ఆయనతో రెండోసారి.. పొలిటికల్ నేపథ్యం

'అరవింద సమేత' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంతో వచ్చే దీనికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

చాలా కాలం అయింది.. ఆగిపోయిందంట

చాలా కాలం అయింది.. ఆగిపోయిందంట

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రానున్న రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడింది. కానీ, ఆ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. అంతెందుకు దీని అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో ఈ మూవీ ప్రకటనకే పరిమితమై ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. దీంతో నందమూరి అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

ఎన్టీఆర్ ఆయనతో... త్రివిక్రమ్ అతడితో

ఎన్టీఆర్ ఆయనతో... త్రివిక్రమ్ అతడితో

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయాలనుకున్న సినిమా ఆగిపోయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మరో వార్త బయటకు వచ్చింది. యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్‌ను అందించిన కొరటాల శివతో చేయబోతున్నాడట. దీన్ని సోమవారమే ప్రకటించనున్నారని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ మాత్రం తన తర్వాతి సినిమాను మహేశ్‌తో చేస్తాడని టాక్.

ఎన్టీఆర్30 అప్‌డేట్.. హింటిచ్చిన నిర్మాత

ఎన్టీఆర్30 అప్‌డేట్.. హింటిచ్చిన నిర్మాత

ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమా అప్‌డేట్ సోమవారం సాయంత్రం 7.02 గంటలకు రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు దీనికి సంబంధించిన విషయాన్ని వెల్లడిస్తూ.. 'అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు లభించును' అని నిన్న ట్వీట్ చేశాడు. ఇది జనతా గ్యారేజ్ ట్యాగ్ లైన్‌లా ఉండడంతో కొరటాలతోనే తారక్ సినిమా అని అంతా ఫిక్స్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X