Spirit కోసం మునుపెన్నడూ నటించని పాత్రలో ప్రభాస్.. వివరాలు లీక్ చేసిన నిర్మాత!

బాహుబలి అనే ఒక్క సినిమాతో ప్రభాస్‌ ఒక్క సారిగా నేషనల్‌ హీరోగా మారి పోయాడు. అంతకుముందు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ స్టామినా ఈ సినిమాతో ఒక్క సారిగా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అయింది. అయితే ఆయన చేస్తున్న వరుస సినిమాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన అంటిస్తున్న స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నిర్మాత భూషణ్ కుమార్. ఆ వివరాల్లోకి వెళితే

రాధే శ్యామ్

రాధే శ్యామ్

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా 'రాధే శ్యామ్'. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఆగస్టుకి రిలీజ్

ఆగస్టుకి రిలీజ్

ఈ ఏడాది ఆగస్టుకి రిలీజ్ అవుతున్న ఆది పురుష్ ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ తో పాటు నాగాశ్విన్ తో 300 కోట్లతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె ను కూడా లైన్ లో పెట్టారు ప్రభాస్. దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ కె , మీద అందరిలో ఆసక్తి నెలకొంది.

 స్పిరిట్

స్పిరిట్

మరో పక్క ఆయన స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో ప్ర 'స్పిరిట్‌' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు నిర్మాత భూషణ్ కుమార్.

తొలిసారి పోలీస్ పాత్రలో

తొలిసారి పోలీస్ పాత్రలో

స్పిరిట్‌ సినిమా గురించి మాట్లాడుతూ "సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్‌ని సినిమా చేశారు, ఆయనకు నార్త్ ఇండియన్ సెన్సిబిలిటీలు తెలుసు. స్పిరిట్ కి చాలా సమయం ఉంది, కానీ ఇది గొప్ప చిత్రం అవుతుందని అన్నారు. ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని వెల్లడించారు. స్పిరిట్‌కి వెళ్లే ముందు, 2022 వేసవి నుండి ప్రారంభమయ్యే యానిమల్‌ షూటింగ్ లో సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్‌ని డైరెక్ట్ చేయనున్నారు.

Recommended Video

Radhe Shyam Musical Tour Begins From Vizag | Filmibeat Telugu
అద్భుతమైన విధంగా

అద్భుతమైన విధంగా

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ గురించి భూషణ్ కుమార్ మాట్లాడుతూ, "ఆదిపురుష్ ప్రభాస్ కోసమే రూపొందించబడిందని అన్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని, ఇక షూటింగ్ సమయంలో అద్భుతమైన విధంగా ఆయన పని చేసాడని అన్నారు. ఇది మా మోస్ట్ అవైటెడ్ చిత్రం మరియు 2022లో విడుదల చేయాలని భావిస్తున్నాము. ఇది రామాయణం కావడంతో ప్రేక్షకులకు విభిన్నమైన విజువల్ ట్రీట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X