OG Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. టాలీవుడ్ హిస్టరీలో తొలి సినిమాగా.. అందులో మాత్రం రౌడీ కంటే!

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా చేయడానికి తక్కువలో తక్కువగా ఒక ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ, టాలీవుడ్‌లోని కొందరు స్టార్లు మాత్రం వేగంగా సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు.

రీఎంట్రీలో రాకెట్ వేగంతో దూసుకుపోతోన్న ఈ మెగా హీరో.. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా.. అది రికార్డులు క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసమే!

OG Glimpse Records

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్: పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'OG'. దీన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

OG Glimpse Records

పవన్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'OG' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతున్నా.. దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అదే సమయంలో ఏదైనా కానుకను అందించాలని కోరుకున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ బర్త్‌డేను పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన 'OG' మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌కు అదిరిన రెస్పాన్స్: 'OG' మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీన్ని పవన్ అభిమానులు మాత్రమే కాదు.. సామాన్య సినీ ప్రియులు కూడా ఆదరించారు. దీంతో ఈ వీడియోకు భారీగా వ్యూస్, లైకులు వచ్చాయి. ఇక, ఈ గ్లింప్స్ 24 గంటల్లోనే ఒకే ఛానెల్ ద్వారా 14.49 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. అలాగే, 731K లైకులను కూడా సొంతం చేసుకుంది.

OG Glimpse Records

ఇండియాలో 7వ స్థానంలో: 24 గంటల్లోనే ఏకంగా 14.49 మిలియన్ వ్యూస్‌ను అందుకున్న 'OG' గ్లింప్స్ ఎన్నో అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ల జాబితాలో ఇది 7వ స్థానానికి చేరింది. ఇందులో 'పుష్ప 2' గ్లింప్స్ టాప్‌లో ఉంది. దీని తర్వాత 'గుంటూరు కారం', 'కంగువా', 'పుష్ప' (తెలుగు), 'లైగర్', 'ఉస్తాద్ భగత్ సింగ్'లు ఉన్నాయి.

OG Glimpse Records

తెలుగులో ఐదో స్థానానికి: ఒకే ఛానెల్ ద్వారా వచ్చి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్ 'OG' మూవీ గ్లింప్స్ తెలుగులోనూ మంచి రికార్డులే సాధించింది. ముఖ్యంగా వ్యూస్ పరంగా ఇది ఐదో స్థానానికి చేరింది. ఈ లిస్టులో మహేశ్ 'గుంటూరు కారం' 20.98 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉంది. తర్వాత బన్నీ 'పుష్ప 2', విజయ్ దేవరకొండ 'లైగర్', 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్‌లు ఉన్నాయి.

OG Glimpse Records

అందులో చరిత్ర సృష్టించి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'OG' గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 731K వచ్చాయి. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎక్కువ లైకులు సాధించిన గ్లింప్స్‌గా ఇది చరిత్రను సృష్టించింది. అయితే, ఇండియాలో చూసుకుంటే మాత్రం పవన్ గ్లింప్స్ నాలుగో స్థానానికి చేరింది. ఈ లిస్టులో పుష్ప 1.29 మిలియన్ లైకులతో మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X