మెగాస్టార్ రేంజ్ అంటే అదిరా.. దేశ అగ్ర నేతలను కూడా పట్టించుకోలేదు, మెగాస్టార్ ఒక్కడికే జెట్ స్పీడ్ ఆన్సర్

మెగాస్టార్ రెంజ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా పైకొచ్చిన నెంబర్ వన్ స్టార్ హీరో. చిన్నపాటి విలన్ రోల్స్ నుంచి మెగాస్టార్ హోదా వరకు ఆయన వేసిన బాట అంత ఈజీగా ఏమి కొనసాగలేదు. అభిమానులను కూడా అదే స్థాయిలో ప్రేమించాడు కాబట్టే నిజమైన మెగాస్టార్ అయ్యారు. ఇక ఇటీవల అగ్ర దేశాధినేతలకు సైతం అంత ఈజీగా దక్కని రెస్పాన్స్ ఒక విషయంలో మెగాస్టార్ కు దక్కడం విశేషం.

పీవీ సింధు సరికొత్త రికార్డు..

పీవీ సింధు సరికొత్త రికార్డు..

ఇటీవల ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు రియో, టోక్యో ఒలింపిక్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. చైనా క్రీడాకారిణి మీద పైచేయి సాధించి కాంస్యాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ చరిత్రలో వరుసగా రెండు సార్లు పతకాలు గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళగా పీవీ సింధు సరికొత్త రికార్డును అందుకోవడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి కూడా

మెగాస్టార్ చిరంజీవి కూడా

ఈ సరికొత్త రికార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి. పీవీ సింధు రజతం, కాంస్యాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ నుంచి అన్ని రాష్ట్ర సీఎంల వరకు అందరు కూడా ప్రత్యేకంగా అభినందించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.

మా మహిళా శక్తిని ఎవరు ఆపలేరు

మా మహిళా శక్తిని ఎవరు ఆపలేరు

మెగాస్టార్ చిరంజీవి పీవీ సింధుకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. పతకం గెలుచుకున్నందుకు అలాగే వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా కూడా చరిత్ర సృష్టించినందుకు పీవీ సింధుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు గెలిచిన రెండు పతకాలు భారతీయ మహిళలే కావడం సంతోషంగా ఉంది. మా మహిళా శక్తిని ఎవరు ఆపలేరు. మీరు భారతదేశాన్ని గర్వపడేలా చేసారు. అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

ఎంతో స్ఫూర్తివంతురాలు

ఎంతో స్ఫూర్తివంతురాలు

అయితే ఎంతోమంది దేశాధినేతలు ముఖ్యమంత్రులు సైతం వారి ప్లేయర్స్ కు అభినందనలు తెలుపుతున్న క్రమంలో ముందుగా మెగాస్టార్ చేసిన ట్వీట్ కు ఒలింపిక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ జెట్ స్పీడ్ లో సమాధానం ఇవ్వడం విశేషం. పీవీ సింధు ఎంతో స్ఫూర్తివంతురాలు అంటూ సమాధానం ఇవ్వడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది..

Recommended Video

Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
మెగాస్టార్ రేంజ్ అంటే అదిరా

మెగాస్టార్ రేంజ్ అంటే అదిరా

నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళకి మెగాస్టార్ రేంజ్ అంటే అదిరా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ ట్వీట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందికు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అనంతరం బాబీ దర్శకత్వంలో మరొక సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే లూసిఫర్ రీమేక్ ను కూడా త్వరలోనే సెట్స్ పైకి తేనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X