ప్రభాస్ పై షాకింగ్ కామెంట్.. 100 కోట్ల డిజాస్టర్ మూవీ డైరెక్టర్ నోటి దురుసు

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్నటువంటి టాప్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రెబల్స్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. రెబల్ స్టార్ స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగి తాను భారీ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ కి సరైన సినిమా పడితే అది నెక్స్ట్ లెవెల్లో వసూళ్లు చేస్తుంది అని తాజా చిత్రం "కల్కి 2898 ఎడి" తో ప్రూవ్ అయ్యింది.

అయితే బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ మార్కెట్ మరింత స్థాయిలో పెరిగింది. దీనితో ప్రభాస్ మార్కెట్ తో డబ్బులు చేసుకోవాలని హిందీ నిర్మాతలు సైతం క్యూలు కడుతున్నారు. అలా బాహుబలి 2 అయ్యిన వెంటనే టి సిరీస్ సంస్థ ప్రభాస్ తో మూడు సినిమాలు కాదు ఏకంగా నాలుగు సినిమాలు లాక్ చేసుకుంది. కాగా ఆ చిత్రాల్లో మూడు ఆల్రెడీ రిలీజ్ కూడా అయ్యిపోయాయి. ఇంట్రెస్టింగ్ గా ఆ మూడు కూడా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గానే నిలిచాయి.

omraut made shocking comments on prabhas stadom after giving crores lose with adipurush

కాగా ఆ సినిమాలే ఒకటి "సాహో", "రాధే శ్యామ్" మరొకటి "ఆదిపురుష్". కొంచెం సేపు సుజీత్ తెరకెక్కించిన సాహో, రాధాకృష్ణ తీసిన రాధే శ్యామ్ పక్కన పెడితే హిందీ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన "ఆదిపురుష్" కోసం మాట్లాడుకోవాలి. ప్రభాస్ తో ఒక్క లీక్ లేకుండా సినిమా పూర్తి చేసిన దర్శకుడుగా ఓంరౌత్ కి మంచి క్రెడిట్ దక్కుతుంది కానీ రామాయణం లాంటి సబ్జెక్టు పెట్టుకొని ప్రభాస్ తో ఘోరమైన డిజాస్టర్ తీసాడు అనే మారక కూడా ఓం పై ఉండిపోయింది.

మెయిన్ గా చాలా అంచనాలు పెట్టుకున్న అభిమానులు బాజా డిజప్పాయింట్ అయ్యారు. దీనితో ఓంరౌత్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తన కామెంట్స్ ని ఆన్ చేసుకోడు. కాగా ఆదిపురుష్ ఫలితంపై కానీ ప్రభాస్ పై కానీ ఇన్నేళ్లు మాట్లాడని ఓంరౌత్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. తాను మాట్లాడుతూ ఇండియన్ సినిమా దగ్గర ప్రభాస్ అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లు ప్లాప్ ప్రూఫ్ అంటూ ఒక మ్యాడ్ స్టేట్మెంట్ ని ఇచ్చాడు.

omraut made shocking comments on prabhas stadom after giving crores lose with adipurush

వాళ్ళు ప్లాప్ లు తీసినా వారి మార్కెట్ చెక్కు చెదరదు అంటూ కొనియాడాడు. అయితే ఇది ఫ్యాన్స్ కి వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆదిపురుష్ ఇచ్చిన లాసులు మాత్రం పూడ్చగలదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి వందల కోట్ల నష్టం వచ్చింది. మరి ఈ సంగతేంటి అని నెటిజన్స్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా ఓ హీరోకి వందల కోట్ల నష్టాన్ని ఇచ్చి ఇపుడు ఆ హీరో ప్లాప్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అంటే అందులో అర్ధం ఏముంది? ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓంరౌత్ కొట్టిన దెబ్బ మాత్రం ఎప్పటికీ వారు మర్చిపోలేరు. ప్రభాస్ ఎంతో నమ్మకంగా హిందీలో చేసిన మొదటి సినిమా ఇది దానిని ఓంరౌత్ హిట్ గా మలచలేకపోయాడు అని ప్రభాస్ అభిమానుల ఆవేదన.

More from Filmibeat

Read more about: prabhas omraut adipurush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X