twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు రామ్ చరణ్ చెప్పగా.. ఇప్పుడు అల్లు వారబ్బాయి చెప్పాడు.. రియర్ హీరోస్

    |

    పోటీ ప్రపంచం, గొప్పలకు పోయే కాలం, ఇతరుల కంటే తనదే పైచేయి అని ఫీలయ్యే యుగం.. ఇవ్వనీ ప్రస్తుత ప్రపంచంలో నిత్యం జరుగుతున్న పరిణామలు. లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే వ్యక్తులు కరువయ్యారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే తమ సినిమాకు ఎంత పెట్టాం.. ఎంత రాబట్టాం అనే లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. తమ సినిమాకు హైప్ తీసుకురావాలనే నేపథ్యంలో లెక్కలు తప్పుగా చూపినా ఎవరికీ మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రెసెంట్ జరుగుతున్నవి కూడా అవే. అలాంటి ఈ రోజుల్లో ముక్కుసూటిగా తన ఓటమిని ఒప్పుకునే హీరోలు కూడా ఉన్నారని ప్రూవ్ చేశారు మెగా కాంపౌండ్ హీరోలు.

    కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు అల్లువారబ్బాయి

    కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు అల్లువారబ్బాయి

    అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కెరీర్ లో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్‌లో సరైన హిట్ కొట్టి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా తెరకెక్కిన ఏబీసీడీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఎప్పటిలాగే ఈ సినిమా కూడా డీలా పడటం ఆయనకు నిరాశే మిగిల్చింది.

    ఏబీసీడీ మూవీ విషయానికొస్తే..

    ఏబీసీడీ మూవీ విషయానికొస్తే..

    మలయాళంలో వచ్చిన ఏబీసీడీ చిత్ర రీమేక్‌‌గా సంజీవ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది తెలుగు ఏబీసీడీ మూవీ. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. రాజా, కోటా శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి.. జరిగింది మరొకటి

    ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి.. జరిగింది మరొకటి

    ఒక్కక్షణం సినిమా తర్వాత అల్లు శిరీష్ కెరీర్‌లో వచ్చిన ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు శిరీష్. మే 17 వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే చేతులెత్తేసింది. విడుదలకు ముందు అల్లు శిరీష్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు.. కానీ అందుకు భిన్నంగా డీలా పడిపోయింది ఏబీసీడీ మూవీ.

    మెప్పించలేక పోయానంటూ అల్లు శిరీష్ లేఖ

    గురువారం (మే 30) అల్లు శిరీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ లేఖను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అల్లు శిరీష్. ఈ లేఖ ద్వారా నా సినిమా జనాల్ని మెప్పించలేదని ధైర్యంగా ఒప్పుకున్నారు శిరీష్. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తున్నాం

    ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తున్నాం

    ''డైరెక్టర్ సంజీవ్ రెడ్డితో పాటు ‘ఏబీసీడీ' టీమంతా అందర్నీ ఎంటర్‌టైన్ చేయడానికి ఎంతగానో కృషి చేశారు. కానీ ఊహించిన విజయం అందుకోలేకపోయాం, అయినా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ఈ జర్నీలో ఎంతగానో సహకరించిన నిర్మాతలకు, అలాగే ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు'' అని లేఖలో పేర్కొన్నారు అల్లు శిరీష్.

    గతంలో చెర్రీ లాగే అల్లు శిరీష్

    గతంలో చెర్రీ లాగే అల్లు శిరీష్

    అంతకు ముందు 'వినయ విధేయ రామ' డిసాస్టర్ కావడంతో రామ్ చరణ్ కూడా ఇలాగే స్పందించి తన హీరోయిజాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు అదే మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ ఇలా స్పందించడం చూసి ఆయనపై అభినందనలు కురిపిస్తున్నారు జనం. 'గొప్పలకు పోయే నేటి తరంలో అల్లు శిరీష్ రియల్ హీరో' అని కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Malayali movie ABCD remake ABCD released but not entertained the audians. This disaster Allu Sirish wrote a lettter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X