మరోసారి చర్చల్లోకి ఆ తమిళ హీరోతో నాని మల్టీస్టారర్.. ఆలస్యం ఎందుకంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త తరహాలో సినిమాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు, స్టార్ హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ కథలపై ఎక్కువగా కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుండడం విశేషం. గతంలో మల్టీస్టారర్ సినిమాలు అంటే స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేసేవారు. కానీ సరైన కథతో వస్తే మాత్రం ప్రస్తుతం ఎలాంటి సినిమా చేయడానికి అయినా సరే వారు సిద్ధంగా ఉన్నారు. అంతే కాకుండా నిర్మాతలు కూడా భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. గత కొంతకాలంగా నాని మల్టీస్టారర్ సినిమా అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి విషయం తెలిసిందే. ఇంతవరకు ఆ ప్రాజెక్టు పై ఎవరు అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఒక దర్శకుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మల్టీ స్టారర్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ గా సినిమాను వెండి తెర పైకి తీసుకు వస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాయి అని కొన్ని సినిమాలు ఋజువు చేశాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా మల్టీ స్టారర్ సినిమాలు చాలానే పుట్టుకొస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఆ రూట్లో లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

RRR సినిమా అనంతరం మరిన్ని పెద్ద మల్టీ స్టారర్ సినిమాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక మల్టీస్టారర్ సినిమాలతోనే ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవచ్చు అని కొంతమంది మీడియం రేంజ్ హీరోలు ఆలోచిస్తున్నారు. ఆ లిస్టులో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు. ఇంతకు ముందు నాని ఒక మల్టీ స్టారర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. నాగార్జున తో చేసిన దేవదాస్ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే ఏమీ సక్సెస్ కాలేకపోయింది.
అయితే నాని కోసం యాత్ర దర్శకుడు మహి వి రాఘవ ఒక మల్టీ స్టారర్ రెండేళ్ల క్రితమే చెప్పాడు. మరొక హీరోగా కోలీవుడ్ హీరో విశాల్ నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే కథలో కొన్ని లోటుపాట్లు ఉండడంతో నాని అప్పుడు ఆ ప్రాజెక్టు పై అంతగా ఆసక్తి చూపించ లేకపోయాడు. ఇక దర్శకుడు మహి వీ రాఘవ మధ్యలో మరొక ప్రాజెక్టు రావడంతో ఆ ప్రాజెక్టును కాస్త పక్కకు పెట్టాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు మాత్రం దర్శకుడు ఎలాగైనా నానిని ఒప్పించాలని మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్ వస్తోంది. సౌత్ లో ఆ సినిమాను అన్ని భాషల్లో శ్యామ్ సింగరాయ్ తరహాలో వెండి తెర పైకి తీసుకురావాలని ఆలోచిస్తురట. ఇక విశాల్ అయితే ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నాని ఈసారైనా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











