ఆ దర్శకులకు మళ్ళీ బ్రేక్ వేసిన పవన్ కళ్యాణ్.. మరో రెండు నెలల ఆగాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలు చేయరేమో అని చాలామంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో మళ్ళీ తాను సినిమాలు చేయకపోవచ్చని కూడా చెప్పాడు. ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ తన స్టామినా ఏంటో మరోసారి రుజువు చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అర్థమయింది. ఇక భవిష్యత్తులో రాబోయే సినిమాలు కూడా అంతకు మించి అనేలా సక్సెస్ అవుతాయి అని చెప్పవచ్చు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ చేతిలో సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నాడు.

సాగర్ కి చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. RRR కారణంగా సంక్రాంతి నుంచి తప్పుకోవడంతో సినిమా కోసం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. ఆ సినిమా షూటింగ్ అయితే తుది దశకు చేరుకుంది కేవలం ఒక పాటను పూర్తి చేస్తే సినిమా విడుదలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు సమ్మర్ మిడ్ లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో మరో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే మరో సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది.

Once again Pawan kalyan two months break for shootings

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం లేదని ఒక టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో షూటింగ్ చేస్తే ఇతరులు కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అందుకే పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయాలని అనుకోవడం లేదట. మరొక రెండు నెలల పాటు షూటింగ్స్ పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా ఖుషి నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను ఇప్పటికే మొదలు పెట్టాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పూర్తి సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను సెట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే హరీష్ శంకర్ సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ బ్రేక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X