అండర్ వేర్, కండోమ్స్ ఇచ్చి హీరోకు ప్రపోజ్ చేసిన అమ్మాయి.. దెబ్బకు ఇల్లు ఖాళీ చేసిన అందగాడు ఎవరంటే?

సాధారణంగా ఎవరైనా సరే తమ మనసులోని ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చూపిస్తుంటారు. చాలా మంది మెసేజ్ లు చేసి, ఫోన్ లో, నేరుగా కలిసి, పువ్వు ఇచ్చి, ఉంగరం ఇచ్చి, వాచ్, సెల్ ఫోన్లు.. ఇవన్నీ కావనుకుంటే ఉత్తరాలు ఇచ్చి ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. కానీ కాలం మారింది. అందుకు తగ్గట్టుగానే అబ్బాయిలూ, అమ్మాయిలు కూడా మారారు. తమకు ఏం కావాలో నేరుగా చెప్పేస్తున్నారు. అర్థం అయ్యేలా గిఫ్టులు కూడా ఇస్తున్నారు. అయితే అలాంటి ఓ అమ్మాయే ఓ కుర్ర హీరోకు.. అండర్ వేర్, కండోమ్స్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసిందట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందాల రాక్షసి సినిమాలో హీరోగా చేసిన నవీన్ చంద్ర అందరికీ గుర్తుండే ఉంటాడు. ఫుల్ గా గడ్డం పెంచేసుకుని.. అమ్మాయి ప్రేమలో మునిగిపోయి.. బీర్ సీసాలతో ఆమె రూపాన్ని చిత్రీకరించిన అతడిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అంతటి అద్భుతమైన సినిమాలో జీవించేసిన ఈ కుర్ర హీరో తాజాగా తెలుగులో వచ్చే ఓ టాక్ షోకు హాజరు అయ్యాడు. రితూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ అనే షోకు వచ్చి తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనకు వచ్చిన ఓ డిఫరెంట్ లవ్ ప్రపోజల్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

 One Girl Proposed to Hero Naveen Chandra With Under Wear And Condoms Check Details

తాను సినిమాలు చేస్తూ ఓ గది అద్దెకు తీసుకుని ఉండగా.. తనకు ఓ అమ్మాయి ప్రపోజ్ చేసిందట. ఇతడంటే ఇష్టం అని నేరుగా చెప్పకుండా.. తన కారుకు మొత్తం లిప్ స్టిక్ తో ముద్దులు పెడుతూ సూర్య అని రాసి మరీ తన ప్రేమను వ్యక్త పరిచిందట. అంతే కాదండోయ్.. అండర్ వేర్, కండోమ్స్ వంటివి కూడా ఇచ్చి మరీ తన ప్రేమను వివరించిందట. అది చూసి అతడు షాక్ అయ్యాడట. ఏం చేయాలో పాలుపోక ఆ తర్వాత ఇళ్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందట.

 One Girl Proposed to Hero Naveen Chandra With Under Wear And Condoms Check Details

ఇలా తొలిసారి తనకు వచ్చిన లవ్ ప్రపోజలు గురించి చెప్పి అందరికీ గట్టి షాక్ ఇచ్చాడు. అలాగే తనకు నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా ఇప్పుడు ఓ అబ్బాయి కూడా ఉన్నాడని.. చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే ఇటీవలే కలర్స్ స్వాతితో కలిసి మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో కనిపించి మస్త్ గా మెస్మరైజ్ చేశాడు. మీరూ ఓసారి రితూ చౌదరితో వచ్చిన ఈయన ఇంటర్వ్యూ చూసి మరింత ఎక్కువగా ఈ కుర్ర హీరో గురించి తెలుసుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X