Just In
- 48 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మింగుడు పడని వార్త.. మహేశ్ కనిపించేది ఐదు నిమిషాలే.!
కొరటాల శివ తీసిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' వంటి వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ రెండు సినిమాలూ భారీ విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేశాయి. ఈ క్రమంలోనే మహేశ్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిశాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేశారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

వాళ్లందరూ కలిసి సరిలేరు అనిపించుకుంటారా?
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అలాగే, ఈ సినిమా ద్వారా ముగ్గురు సీనియర్ యాక్టర్స్ విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత రీఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో చాలా మంది టాలెంటెండ్ యాక్టర్స్ పని చేస్తున్నారు. అలాగే, దేవీ శ్రీ ప్రసాద్ సహా ఎంతో మంది టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.

వాటి వల్ల సినిమాపై పెరిగిపోయిన అంచనాలు
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు' యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే టీజర్‌తో పాటు పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కొన్ని పాటలైతే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. అందుకే ఇలా..
ఈ సినిమా హిట్ అయితే మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు అవుతుంది. దీంతో ఇటు మహేశ్.. అటు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మూవీ కోసం మహేశ్ గతంలో లేని విధంగా డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీలూ ట్రై చేస్తుండగా.. అనిల్ కూడా తనను తాను సరికొత్తగా నిరూపించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న అనిల్
సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతోంది. కానీ, ఈ మధ్య వచ్చిన లీకుల ప్రకారం ఈ సినిమా చాలా వరకు కామెడీ సీన్స్‌తో నిండి ఉంటుందట. ముఖ్యంగా ట్రైన్‌లో వచ్చే కామిక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా అనిల్ కామెడీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని టాక్.

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మింగుడు పడని వార్త
ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా కనిపిస్తున్నందున మహేశ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు బోర్డర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు. కానీ, ఇందులో బోర్డర్ సీక్వెన్స్ కనిపించేది కేవలం ఐదు నిమిషాలేనని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే, అంతకు మించిన సీన్స్ కర్నూల్‌లో జరిగే ఎపిసోడ్‌లో ఉంటుందని సమాచారం.