Top 10 Heroes: నంబర్ వన్ స్థానంలో ప్రభాస్.. అల్లు అర్జున్, రామ్ చరణ్ కు ఎన్నో స్థానాలంటే?

Top 10 Heroes: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్‌ అనే భావన ఉండేది. ఇండస్ట్రీలో హిందీ స్టార్‌లలో ఆధిపత్యం చెలాయించేవారు. అయితే, గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ కంటెంట్, తెలుగు సినిమాల స్కేల్ పెరగడం, పాన్ ఇండియా సినిమాలు తీయడంతో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ఈ మార్పును మరోసారి స్పష్టం చేసిన తాజా నివేదిక ప్రముఖ మీడియా అనలిటిక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా (Ormax Media) విడుదల చేసిన 'ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ - ఏప్రిల్ 2026' రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా జాబితాలో మళ్లీ నంబర్ వన్ కైవసం చేసుకున్నాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. గత నాలుగు నెలలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ప్రభాస్, ఈసారి కూడా తన క్రేజ్ తగ్గలేదని నిరూపించాడు.'బాహుబలి' సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన, ఆ తర్వాత వచ్చిన 'సలార్', 'కల్కి 2898 AD' సినిమాలతో తన మార్కెట్‌ను మరింతగా విస్తరించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పిరిట్, ఫౌజి, కల్కి 2 వంటి భారీ సినిమాలతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ormax April 2026 Top 10 Heroes List Prabhas Leads Big Drops for Ram Charan allu arjun NTR

రెండో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నిలిచారు. గత కొన్ని నెలలుగా వచ్చిన తన మెరుగుపరుచుకుంటూ షారూఖ్, ఈసారి టాప్ 2లోకి ఎగబాకడం విశేషం. ఆయన నటిస్తున్న 'కింగ్' మూవీపై ఉన్న హైప్ కూడా దీనికి కారణమని చెప్పవచ్చు. ఇక మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప ఫ్రాంచైజ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, గత నెలలో ఒక స్థానం పడిపోయిన టాప్ 3లో నిలిచారు.

నాలుగో స్థానంలో తమిళ స్టార్ విజయ్ ఉండగా, ఆయన కూడా గత నెలలో తాజా ర్యాంక్ కోల్పోయారు. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. అయినా ఈసారి ర్యాంక్ తగ్గడం ఆసక్తికరం. ఇక ఐదో స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నిలిచారు. ఆయన స్థానం మాత్రం స్థిరంగా ఉండటం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ఆయన భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'పై ఫోకస్ చేస్తున్నారు.

ఈ జాబితాలో సర్ప్రైజ్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్. ధురంధర్ 2 ప్రభావంతో ఆయన నేరుగా ఆరో స్థానానికి ఎగబాకారు. గతంలో టాప్ 10లో కూడా సరిగ్గా స్థానం సంపాదించలేకపోయిన రణ్‌వీర్, ఒక్కసారిగా టాప్ 6లోకి రావడం ఆయన క్రేజ్ పెరిగింది.ఇక ఏడో స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. RRR తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చరణ్, ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఎనిమిదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉండగా, తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు.

చివరిగా పదో స్థానంలో టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మేసెస్ జూనియర్ ఎన్టీఆర్ (N.T.R).'RRR' తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన తారక్, ప్రస్తుతం 'డ్రాగన్' చిత్రంతో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈసారి ఒక స్థానం పడిపోవడం అభిమానులకు షాక్ లాగా మారింది. మొత్తంగా ఈ రిపోర్ట్‌ను చూస్తే.. టాప్ 10లో ఐదు స్థానాలు తెలుగు హీరోలే కైవసం చేసుకోవడం టాలీవుడ్ డామినేషన్‌ కనిపిస్తుంది. రాబోయే నెలల్లో విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలు ఈ ర్యాంకింగ్స్‌లో మరిన్ని భారీ మార్పులు తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం ఇండియన్ సినీ రంగంలో టాలీవుడ్ హవా కొనసాగుతుందనే విషయం ఈ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది.

Read more about: ram charan allu arjun prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X