Most Awaited Telugu Films: ఎక్కువమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ఈ సినిమాలు కోసమే..

తెలుగు చిత్ర పరిశ్రమల ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించిన విధానంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. ఇక రాబోయే సినిమాలు కూడా టాలీవుడ్ మార్కెట్ స్థాయిని మరింత పెంచుతాయని చెప్పవచ్చు. ఇక తెలుగులో అయితే ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా ఒక 5 సినిమాలపై ఉన్నట్లుగా తెలుస్తోంది. డిజిటల్ సోషల్ మీడియా సర్వేల ఆధారంగా ర్యాంకులు విడుదల చేసే ఓరామాక్స్ సంస్థ ఇటీవల మరొక లిస్టుని విడుదల చేసింది. ఇక అందులో ఉన్న టాప్ సినిమాల వివరాల్లోకి వెళితే..

పుష్ప పార్ట్ 2

పుష్ప పార్ట్ 2

ఎక్కువగా అందరి ఫోకస్ అయితే అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సీక్వెల్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద అంతకుమించి అనేలా సక్సెస్ అవుతుంది అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఓరామాక్స్ సర్వేలో అందరూ ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లిస్టులో ఇది టాప్ లిస్టులో చేరింది.

ప్రభాస్ సలార్

ప్రభాస్ సలార్

ఇక రెండవ స్థానంలో ప్రభాస్ సలార్ సినిమా నిలవడం విశేషం. కేజిఎఫ్ సక్సెస్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురాబోతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా సినిమా అద్భుతంగా ఉంటుంది అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుష్

ఆదిపురుష్

అలాగే ప్రభాస్ నటిస్తున్న మరొక బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ సినిమా కోసం కూడా ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఓరామాక్స్ సర్వేలో వెళ్లడైంది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన సరైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు కానీ సినిమా చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రానుంది.

హరిహర వీరమల్లు

హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ హరిహర వీరమల్లు సినిమాపై కూడా అంచనాల భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఓరామక్స్ సర్వేలో నాలుగో స్థానంలో నిలిచింది.

విజయ్ దేవరకొండ ఖుషి

విజయ్ దేవరకొండ ఖుషి

ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా చేరింది. శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి తుది దశకు చేరుకుంది. ఇక ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఓరా మ్యాక్స్ సర్వేలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లిస్టులో ఖుషి సినిమా ఐదవ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X