Top 10 Heroes: టాప్ 1 నుంచి ప్రభాస్ అవుట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, చెర్రీ చివరిస్థానాల్లో.. నెంబర్ వన్ ఎవరం

సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది తెలుగు సినిమా, ఏది హాలీవుడ్ సినిమా అని చెప్పడం కష్టంగా మారింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో చివర్లో ఉండేది. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా అంటే టాప్ వన్ లో కనిపిస్తుంది. అంతలా తెలుగు సినిమాను అంతర్జాతీయ లెవెల్లో నిలబెట్టారు మన దర్శకులు.

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఎవరిని అడిగినా తెలుగు హీరోల పేర్లు టక్కున చెప్పేస్తున్నారు. ఇక ప్రతి నెల ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్‌ పొజిషన్‌లో ఉన్న సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఒకప్పుడు ఈ సర్వేలో టాలీవుడ్ హీరోలు చాలా రేర్ గా కనిపించేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోలు తప్ప మిగతావారు చాలా రేర్ గా కనిపిస్తున్నారు.

Ormax media has revealed the top ten trending heroes According to the survey conducted by this organization

తాజాగా ఏప్రిల్ 2024 ఆర్మాక్స్ మీడియా సర్వే వచ్చేసింది. ఇందులో టాప్ వన్ పొజిషన్లో ఈసారి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిలబడడం అందర్నీ ఆశ్చర్యాలకు గురిచేస్తుంది. గత ఏడాది నుంచి షారుక్ తెలుగు వారికి కూడా బాగానే పరిచయం అయ్యాడు జవాన్, పఠాన్, డంకీ సినిమాలు షారుక్ పేరును సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార్చాయి.

ఇక షారుక్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ప్లాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలబడ్డాడు. ప్రభాస్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ తర్వాత నుంచి ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కల్కి, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ ఉన్నాయి.

Ormax media has revealed the top ten trending heroes According to the survey conducted by this organization

సినిమా హిట్, ఫ్లాప్ అనేవాటితో సంబంధం లేకుండా కనీసం రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు డార్లింగ్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అందుకే ప్రభాస్ ఈ సర్వేలో సెకండ్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఇక ప్రభాస్ తర్వాత వరుసగా టాప్ 3 పొజిషన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉండగా.. టాప్ 4 పొజిషన్ ను మహేష్ బాబు దక్కించుకున్నాడు. ఇక 5 వ స్థానంలో అక్షయ్ కుమార్, 6 వ స్థానంలో సల్మాన్ ఖాన్, 7 వ స్థానంలో హృతిక్ రోషన్ ఉండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 8 వ స్థానాన్ని అందుకున్నాడు.

ఇక ఈసారి చివరి రెండు స్థానాల్లో ఆర్ఆర్ఆర్ కాంబో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండడం విశేషం. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ హీరోలు వెండితెరపై కనిపించింది లేదు. వరుస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ , సోషల్ మీడియాలో హైప్ ఇచ్చేంత కంటెంట్ ను ఈ కుర్ర హీరోలు అందివ్వలేదని చెప్పాలి.

Ormax media has revealed the top ten trending heroes According to the survey conducted by this organization

ఇక ఈసారి షారుక్ ఫస్ట్ ప్లేస్ లో నిలబడడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎవరు ఊహించలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే అసలు ఈ సర్వేనే తప్పు అని కొట్టిపారేస్తున్నారు. మరి మే నెల పోయినా.. జూన్ లో మొదటి స్థానం టాలీవుడ్ హీరో కబ్జా చేస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X