Top 10 Heros: తెలుగులో టాప్ 10 హీరోలు వీళ్లే... ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఏ స్థానాల్లో ఉన్నారంటే?
టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు.. ఏ హీరో మొదటి స్థానంలో ఉన్నారు.. ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అంటే.. ఎవరి హీరో అభిమానులు.. వారే గొప్ప అన్నట్లుగా చెప్పుకువస్తారు. అయితే నిజానికి నెంబర్ హీరో అని ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించి టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ అనేది తేల్చింది. అంతే కాదు టాప్ 10 హీరోల లిస్టును రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుంది. ఏ హీరో, ఏ హీరోయిన్ టాప్ 10 స్థానాల్లో ఉన్నారో ప్రతి నెల ఓ లిస్టును రిలీజ్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో ఏ హీరో నంబర్ వన్ అంటే.. ఎవరి హీరో అభిమానులు తమ హీరోనే గొప్ప అన్నట్లుగా మాట్లాడుతారు. నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ కరెక్ట్ గా చెప్పలేరు. ఎందుకంటే ఏ హీరో తక్కువ కాదు... మరో హీరో ఎక్కువ కాదనే విషయం తెలిసిందే.

ఎవరికి తగినట్లుగా వాళ్లు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ.. సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తారు. అయితే ప్రముఖ మీడియా స్థంస్థ ఆర్మాక్స్ ప్రతినెలా టాప్ హీరోలుగా, టాప్ హీరోయిన్లుగా ఎవరు ఉన్నారనే విషయాన్ని ఓ లిస్టుగా రిలీజ్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కువగా చర్చ జరిగిన హీరోల జాబితాను ఆర్మాక్స్ ప్రతినెలా రిలీజ్ చేస్తుంది. అలా అక్టోబర్, 2023 సంవత్సరానికి సంబంధించిన లిస్టును రిలీజ్ చేసింది ఆర్మాక్స్.
అక్టోబర్ నెలకి సంబంధించిన లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితా వీళ్లే అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ లిస్టులో ఎప్పటిలాగే ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయినా.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. 2వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఆయన్ని అనుసరిస్తూ మూడవ స్థానంలో బన్నీ నిలిచాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో, బన్నీ పుష్ప సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇక ఈ లిస్టులో రామ్ చరణ్ నాలుగో స్థానం దక్కించుకోగా మహేశ్ బాబు ఐదవ స్థానం దక్కించుకున్నాడు. ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండగా... ఏడవ స్థానంలో న్యాచురల్ సార్ నాని ఉన్నారు. ఎనిమిదో స్థానంలో విజయ్ దేవరకొండ నిలువగా.. తొమ్మిదో స్థానంలో మెగా స్టార్ చిరంజీవి నిలిచారు. ఇక మాస్ మహారాజ రవితేజ పదవ స్థానం దక్కించుకున్నాడు.
ఇక తెలుగులో వీరందరూ టాప్ టెన్ హీరోలుగా తేల్చింది ఆర్మాక్స్ మీడియా. ఇక మొత్తం మీద టాప్ 5లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు నిలిచారు. ఇక నాని టైర్ 2 హీరోల జాబితాలో ఉండి కూడా ఆయన ఏడవ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక అదండి అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితా.


Click it and Unblock the Notifications











