Year End 2023 ప్రభాస్‌ను కొట్టే వాడు లేడుగా.. ఎంత మంది ఉన్నా రెబల్ స్టార్ తర్వాతే!
Year End 2023 Tollywood Top 10 Heros: బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ఆయన సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక సాలిడ్ హిట్ పడితే.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఇక ఆ సాలిడ్ హిట్ పడితే ఆయన రేంజ్ ఎలా ఉంటుందో ఊహించలేం. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో తెలుగులో టాప్ హీరో ప్రభాస్ అని తేల్చింది. దానితో పాటు టాప్ 10 హీరోస్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ టాప్ 10 హీరోస్:
టాలీవుడ్‌లో టాప్ హీరో ఎవరు అంటే... ఎవరి హీరో అభిమానులు.. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అని చెప్పుకుంటారనే విషయం తెలిసిందే. అయితే నిజానికి ఎవరు కరెక్టుగా చెప్పలేరు. ఎందుకంటే ఎవరికి ఉండే ప్రాధాన్యత ఆ హీరోకు ఉంటుంది. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తుంది. తాజాగా టాలీవుడ్ లో టాప్ 10హీరోలపై ఆర్మాక్స్ సోషల్ మీడియా, ఆన్ లైన్ మాధ్యమాల ఆధారంగా ఓ సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోలుగా ఎవరు ఉన్నారో.. సోషల్ మీడియా వేదికగా లిస్టును షేర్ చేసింది.

టాప్ 1లో ప్రభాస్:
ఆర్మాక్స్ మీడియాటు 2023 సంవత్సరానికి సంబంధించిన లిస్టును టాప్ 10 హీరోల రిలీజ్ చేసింది. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితా వీళ్లే అంటూ సోషల్ మీడియాలో హీరోల వివరాలను వెల్లడించింది. ఈ లిస్టులో ఎప్పటిలాగే ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన్ని కొట్టే హీరో రావడం లేదనే చెప్పాలి. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోయినా... ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గడం లేదు. వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయనే నంబర్ 1గా ఉంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మహేశ్, ఎన్టీఆర్, బన్నీ స్థానాలు:
ఇక టాప్ 2 హీరోగా మహేశ్ బాబు నిలిచాడు. వయసు 50ఏళ్లకు వస్తున్నా... పాతికేళ్ల కుర్రాడిలో అమ్మాయిల మనసు దోచే ఈ హీరో.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక 3వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఈ హీరో దేవర చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక 4వ స్థానంలో బన్నీ నిలిచాడు. ఈ హీరో పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
5వ స్థానంలో రామ్ చరణ్:
ఇక టాప్ 5 స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఈ హీరో గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. టాప్ 6లో పవన్ కల్యాణ్ నిలివగా.. టాప్ 7 హీరోగా నేచురల్ స్టార్ నాని నిలిచాడు. ఈ హీరో ఇటీవల హాయ్ నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇక టాప్ 8 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. ఈ హీరో పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు.

10వ స్థానంలో చిరు:
ఇక టాప్ 9 స్థానంలో మాస్ మహారాజ్ రవితేజ నిలిచాడు. ఈ హీరో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈగల్ సినిమాతో రానున్నాడు. ఇక టాప్ 10 స్థానంలో చిరంజీవి నిలిచాడు. ఇక ఈ హీరో భోళాశంకర్ సినిమాతో ఫ్లాప్ చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నాడు. ఇవండీ టాలీవుడ్ టాప్ 10 హీరోల జాబితా.


Click it and Unblock the Notifications











