ఏపీ వరద బాధితులకు ప్రభాస్ సహాయం.. టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ విరాళం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరదల కారణంగా చాలా ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ ప్రజల కోసం అండగా ఉండేందుకు సహాయ పడుతూ ఉంటారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మనం టాలీవుడ్ హీరోలు కూడా వారి వంతు సహాయం చేసిన విషయం తెలిసిందే. అందరూ కూడా ఒకే తరహాలో విరాళాలు అందించడం అప్పట్లో హాట్ టాపిక్ మారింది. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందరి కంటే ఎక్కువ విరాళం అంధించి హాట్ టాపిక్ గా నిలిచాడు.

Recommended Video

Prabhas Rs 1 CR Donation Again Like KING Of Heroes | Radhe Shyam || Oneindia Telugu
స్టార్ హీరోల విరాళం

స్టార్ హీరోల విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా వేలాది కుటుంబాలు కూడా రోడ్డు బాట పట్టాల్సి వచ్చింది. అయితే వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మంది సినీ తారలు కూడా సహాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి వారి వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఎంత ఇచ్చారంటే..

ఎంత ఇచ్చారంటే..

తెలుగు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడిన కూడా సినీ తారలు వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో అది రుజువయ్యింది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా వారి వంతు సహాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మరికొంత మంది ప్రముఖ నిర్మాతలు కూడా సీఎం జగన్ ప్రభుత్వానికి విరాళాలు అందించారు.

రెబల్ స్టార్ వారి కంటే ఎక్కువగా

రెబల్ స్టార్ వారి కంటే ఎక్కువగా

చిత్తూరు రాయలసీమ నెల్లూరు ప్రాంతాలు వరదల ధాటికి తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఎంతోమంది రైతు కుటుంబాలు పేద ప్రజలు కూడా వరదల ప్రభావం వలన రోడ్డున పడ్డారు. ఇక మన స్టార్ హీరోలు అందరూ కూడా ఒకే తరహాలో ఇరవై ఐదు లక్షల విరాళాన్ని అందించడం కొత్త ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వారి కంటే వేగంగా మూడింతలు ఎక్కువగా విరాళం ఇచ్చాడు ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలుస్తుంది.

కోటి రూపాయలు ఇవ్వడంతో..

కోటి రూపాయలు ఇవ్వడంతో..

రెబల్ స్టార్ ప్రభాస్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం అందించడంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొకసారి ప్రభాస్ మంచితనాన్ని గురించి మాట్లాడుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

రాధేశ్యామ్ సినిమాతో పాటు సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సినిమాలు లైన్లో ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ పాన్ ఇండియా సినిమాల అనంతరం ప్రభాస్ స్థాయి మరో లెవెల్ కు వెళుతుంది అని కూడా చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X