Prabhas Birthday కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ .. ప్రభాస్‌ను చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఈయనతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆయనను డార్లింగ్ అని పిలుస్తుంటేనే అర్థం అయిపోతుండి ప్రభాస్ ప్రేమ ఎలా ఉంటుందో. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్న ఈయన పుట్టిన రోజు నేడు. ఈక్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆయన అభిమానులు ఘనంగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.
అయితే తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి థైత్లాపూర్ గ్రౌండ్ లో యంగ్ రెబల్ స్టార్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా అక్కడ జరిగిన ఓ సంఘటన చూస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కు కచ్చితంగా రోమాలు నిక్కబొడుస్తాయి. అంతలా ఏం జరిగింది అనుకుంటున్నారా..? 50 కాదు 100 కాదు ఏకంగా 230 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాట్లు చేశారు. అందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

సలార్ సినిమాలో ప్రభాస్ స్టిల్ ను కటౌట్ గా మార్చారు. అంత పెద్ద ఎత్తులో ఉన్న ఈ కటౌట్ కు క్రేన్ సాయంతో పాలాభిషేకం చేశారు. అది మరింత హైలెట్ గా నిలిచింది. ప్రభాస్ ను అంత ఎత్తులో చూస్తుంటే అభిమానులకు చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. అయితే ఒకరోజు ముందు నుంచే ఈ భారీ కటౌట్ ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఈ కటౌట్ దగ్గరే ఆయన అభిమానులంతా కలిసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ముఖ్యంగా డ్రమ్ము నిండా పాలను క్రేన్ సాయంతో పైకి తీసుకెళ్లి ప్రభాస్ కు పాలాభిషేకం చేయడం హైలెట్ గా నిలిచింది.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఈ భారీ కటౌట్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడకు చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు పెద్ద ఎత్తున జేజేలు పలికారు. అయితే శ్రేయాస్ మీడియా, సురేంద్రపురి ఆధ్వర్యంలో ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానెల్ లో ఈ వేడుకలకు సంబంధించి లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు.

మరోవైపు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెరిచారు. ఈ రోజు ట్విట్టర్ మొత్తం ప్రభాస్ వేడుకలకు సంబంధించిన ఫొటోలతోనే నిండిపోయింది. ఏపీ మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, డైరెక్టర్లు మారుతి బాబీ, సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, సప్తగిరి తదితరులు స్పెషల్ విషెస్ తెలిపారు.


Click it and Unblock the Notifications











