హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్న డార్లింగ్.. ఇక ఆ సినిమాతో బిజీబిజీగా..
డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మొదటి మూడు రోజులు అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాత లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 340 గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ ఏ మేరకు ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ ని రాబడుతోంది అనేది తెలియాల్సి ఉంది. 500 కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఆదిపురుష్ చిత్రం విడుదలకు ముందే ప్రభాస్ విదేశాలకు వెళ్ళాడు. అక్కడ మోకాలి గాయానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు టాక్ వచ్చింది. ఇక హడావిడి ముగించుకొని ప్రభాస్ హైదరాబాద్ లో ఈ వారంలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడంపై ప్రభాస్ ఫోకస్ చేయనున్నాడంట. సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.

కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయంట. వాటిని పూర్తి చేయడానికి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడం ఇంకా 25 శాతమే పెండింగ్ ఉంది. దానిని కంప్లీట్ చేసి మారుతితో చేస్తోన్న రాజా డీలాక్స్ మూవీపై ఫుల్ టైమ్ స్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ రిలీజ్ అయిపోవడంతో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాడంట. దీనికోసం టీజర్ ని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవల్ హైప్ కి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నారంట.
తరువాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారంట. అలాగే హనురాఘవపూడి దర్శకత్వంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ కి ఒక సినిమాని కమిట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











